Varun Tej’s ‘Gandeevadhari Arjuna’ Movie Review

Friday,August 25,2023 - 01:15 by Z_CLU

నటీ నటులు : వరుణ్ తేజ్ , సాక్షి వైద్యా, విమలా రామన్ , నాజర్ , వినయ్ రాయ్ , అభినవ్ గోమటం , రవి వర్మ తదితరులు

కెమెరా : ముఖేష్ జీ

మ్యూజిక్ : మిక్కీ జె మేయర్

సమర్పణ : బాపినీడు

నిర్మాణం : శ్రీ వేంకటేశ్వర సినీ క్రియేషన్స్

నిర్మాత : భోగవల్లి ప్రసాద్

రచన -దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు

విడుదల : 25 ఆగస్ట్ 2023

వరుణ్ తేజ్ నుండి వస్తున్న సినిమాలు వరుసగా నిరాశ పరుస్తున్నాయి.  ఈ క్రమంలో ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో 'గాండీవధారి అర్జున' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు వరుణ్. స్టైలిష్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తో ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసింది. మరి ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ మూవీ మెప్పించిందా ? వరుణ్ తేజ్ కి హిట్ పడిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

కథ : 

లండన్ లో జరిగే సమ్మిట్ కి ఇండియా నుండి రిప్రెజెంటివ్ గా హాజరవుతాడు మినిస్టర్ ఆదిత్యా రాజ్ (నాజర్). ఇండియాలో గార్బేజ్(చెత్త) వల్ల వచ్చే రోగాలను సమ్మిట్ లో తెలియజేసి ఓ మార్పు తీసుకురావాలని చూస్తాడు. సీ అండ్ జీ పేరుతో ఇండియాలో గార్బేజ్ తో కోట్ల వ్యాపారం చేస్తున్న రణ్వీర్, మినిస్టర్ ను సమ్మిట్ లో విషయం బయటపెట్టకుండా ఆపాలని చూస్తాడు. దీంతో మినిస్టర్ కి రణ్వీర్ గ్యాంగ్ వల్ల త్రెడ్ ఉందని భావించి ఒక ఎటాక్ వల్ల గాయపడిన మినిస్టర్ పర్సనల్ సెక్యూరిటీ చీఫ్ విజయ్ వెంటనే తన ప్లేస్ లో సెక్యూరిటీ ఆఫీసర్ గా అర్జున్ (వరుణ్ తేజ్) ని పెడతాడు.

మినిస్టర్ కి పీఏ గా పనిచేసే ఐరా(సాక్షి వైద్యా)కి అర్జున్ కి మధ్య ఓ గతం ఉంటుంది. దీంతో అర్జున్ మినిస్టర్ దగ్గర వర్క్ చేయలేక ఉద్యోగం మానేయాలని భావిస్తాడు. కానీ తనకి అర్జున్ అవసరం ఎంత ఉందో మినిస్టర్ తెలియజేసే సరికి అక్కడి నుండి తన భాద్యత తెలుసుకొని మినిస్టర్ కి సమ్మిట్ లో స్పీచ్ ఇచ్చే వరకూ వెనకుండి సెక్యూరిటీ ఇస్తుంటాడు అర్జున్. మినిస్టర్ మనవరాలు రియాను కిడ్నాప్ చేసి బెదిరించే రణ్వీర్ ను అర్జున్ ఎలా ఎటాక్ చేశాడు ? సమ్మిట్ లో మినిస్టర్ ఇండియాలో గార్బేజ్ గురించి చెప్పాక ఎలాంటి మార్పు వచ్చింది ? అనేది 'గాండీవ ధారి అర్జున' కథ.

నటీ నటుల పనితీరు : 

తనకి పర్ఫెక్ట్ అనిపించే కేరెక్టర్ లో వరుణ్ తేజ్ బాగా నటించాడు. కానీ కేరెక్టర్ లో దమ్ము లేకపోవడంతో మెప్పించలేకపోయాడు. సాక్షి వైద్యా గ్లామర్ తో ఆకట్టుకుంది. విమలా రామన్ కి మంచి పాత్ర దక్కింది. దేశానికి మంచి చేయాలనుకున్న మినిస్టర్ పాత్రలో నాజర్ మంచి నటన కనబరిచారు. ఇప్పటికే స్టైలిష్ విలన్ గా మెస్మరైజ్ చేసిన వినయ్ రాయ్ మరో సారి తన కేరెక్టర్ బెస్ట్ అనిపించుకున్నాడు. కానీ సరైన విలనిజం పండించలేకపోయాడు. రవి వర్మ అతను చేసిన చాలా సినిమాళ్లో లానే కనిపించాడు తప్ప కొత్తదనం లేదు. ఫ్రెండ్ పాత్రలో అభినవ్ హీరోకి సపోర్టింగ్ గా కనిపిస్తూ పరవాలేదనిపించాడు. హీరో అమ్మ పాత్రలో కల్పలత తన నటనతో ఆకట్టుకుంది. మిగతా నటీ నటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు : 

టెక్నికల్ గా సినిమాకు అందరి నుండి బెస్ట్ వర్క్ అందింది. ముఖేష్ విజువల్స్ ఎట్రాక్ట్ చేశాయి. మిక్కీ జే మేయర్ ఇచ్చిన స్కోర్ బాగుంది. సినిమాలో ఉన్న ఓకే ఒక్క లవ్ సాంగ్ క్లిక్ అవ్వలేదు. ఆ సాంగ్ మిక్కీ స్థాయిలో లేదు.  ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ వర్క్ పరవాలేదు.  సినిమాను ఇంకా ట్రిమ్ చేయాల్సింది. శివ కామేష్ ఆర్ట్ వర్క్ బాగుంది. లాజ్లో , విజయ్ , వెంకట్ , జుజీ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు ఆశించిన స్థాయిలో లేవు.

ప్రవీణ్ సత్తారు తీసుకున్న పాయింట్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే వీక్ అనిపిస్తుంది. స్టైలిష్ మేకింగ్ ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వెల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష : 

స్టైలిష్ యాక్షన్ సినిమా తీసే ముందు స్ట్రాంగ్ పాయింట్ ఉండాలి. దాని చుట్టూ ఆసక్తిగా సాగే స్క్రీన్ ప్లే మీద వర్క్ చేయాలి. ఈ రెండు సెట్ అయితే స్టైలిష్ యాక్షన్ మూవీస్ తో ఎడ్వెంచర్స్ చేయొచ్చు. ప్రేక్షకులకు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వొచ్చు. ప్రవీణ్ సత్తారు టాలెంటెడ్ డైరెక్టర్. తన   స్టైలిష్  మేకింగ్ తో ఆడియన్స్ కి మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చే దర్శకుడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 'గరుడ వేగ'. రాజశేఖర్ లాంటి సీనియర్ హీరోతో ఆ తరహా సినిమా తీసి ప్రేక్షకులను మెప్పించడం  ఆశా మాషీ కాదు. అందుకే ప్రవీణ్ సత్తారు కి ఆ తర్వాత ఆ తరహా స్టైలిష్ మూవీస్ తీయాలని నిర్మాతలు నుండి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. హీరోలు డేట్స్ ఇస్తూనే ఉన్నారు. 'గరుడ వేగ' తర్వాత ప్రవీణ్ సత్తారు కంటెంట్ మీద ఫోకస్ తగ్గించి మేకింగ్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తుంది. ప్రవీణ్ తీసిన ప్రీవీయస్ మూవీస్ చూస్తే ఇది క్లియర్ గా అర్థమవుతుంది. తను ఎక్కడ విఫలం అవుతున్నాడో తెలుసుకోలేక నిరాశ పరుస్తున్నాడు.

గాండీవ ధారి అర్జున విషయానికొస్తే , ఇండియాలో జరుగుతున్న ఓ మంచి పాయింట్ తీసుకున్నాడు. కానీ దాన్ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. కథ చుట్టూ రాసుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకోలేదు. బలమైన సీన్స్ పడలేదు. హీరో కేరెక్టర్ కూడా తేలిపోయింది. ఈ తరహా సినిమాళ్లో ప్రేక్షకులు ఆశించే స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఆశించిన స్థాయిలో లేవు. భారత దేశంలో పేరుకుపోతున్న చెత్తా, చెదారం మీద సినిమా అంటే స్క్రిప్ట్ మీద ఎక్కువ వర్క్ చేయాలి. ఏ మాత్రం తేడా వచ్చినా డాక్యుమెంటరీ అవుతుంది.  ప్రవీణ్ సత్తారు విఫలం అయింది కూడా ఇక్కడే. సినిమా చూస్తున్నంత సేపు ఏదో డాక్యుమెంటరీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అక్కడక్కడా స్టైలిష్ ఫిలిమ్ మేకింగ్ , యాక్షన్ చూస్తే తప్ప సినిమా ఫీలింగ్ కలగదు. హీరో -మదర్ కి మధ్య సెంటిమెంట్ కూడా వర్కవుట్ అవ్వలేదు. దీంతో ఎమోషనల్ సీన్స్ కి  ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేరు. హీరో -హీరోయిన్ మధ్య వచ్చే ట్రాక్ కూడా ఆకట్టుకోలేదు.

ప్రవీణ్ సత్తారు చెప్పాలనుకున్న గార్బేజ్ కాన్సెప్ట్ మంచిదే, కానీ ఈ సందేశంతో సినిమా చేయాలంటే స్క్రిప్ట్ మీద బోలెడంత వర్క్ చేయాలి. సినిమాకు తీసుకున్న పాయింట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం పక్కన పెడితే చూస్తున్నంత సేపు బోర్ కొడుతుంది. ఇలా కాకుండా ఎంగేజ్ చేసేలా తీసి ఉంటే బాగుండేది. వరుణ్ తేజ్ కి సెక్యూరిటీ ఆఫీసర్ రోల్ యాప్ట్ అనిపిస్తుంది, కానీ కేరెక్టర్ లో దమ్ము లేకపోవడంతో వరుణ్ అర్జున్ గా  ఇంప్రెస్ చేయలేకపోయాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా తేలిపోయింది. ప్రీ క్లైమాక్స్ కి ముందు హీరో, డెడ్ బాడీ ఛేంజ్ ప్లాన్ కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. విలన్ ను పట్టుకునేందుకు ప్రయత్నించే హీరో సీన్స్ కూడా పేలవంగా ఉన్నాయి. ఫైనల్ గా స్టైలిష్ యాక్షన్ మూవీగా థియేటర్స్ లోకి వచ్చిన 'గాండీవ ధారి అర్జున' ప్రేక్షకులను నిరాశ పరిచింది.

 

రేటింగ్ : 2 /5