Chiranjeevi’s ‘Bholaa Shankar’ Review

Friday,August 11,2023 - 03:17 by Z_CLU

నటీనటులు : చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా, రఘు బాబు,  మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను,  ఉత్తేజ్,  తదితరులు

డీఓపీ  : డడ్లీ

సంగీతం :  మహతి స్వర సాగర్

స్క్రిప్ట్ పర్యవేక్షణ  : సత్యానంద్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :  కిషోర్ గరికిపాటి

నిర్మాత  : రామబ్రహ్మం సుంకర

దర్శకత్వం :  మెహర్ రమేష్

విడుదల : 11 ఆగస్ట్ 2023

మెహర్ రమేష్ డైరెక్షన్ లో చిరంజీవి నటించిన 'భోళా శంకర్' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన చిరు ఈ రీమేక్ తో మరో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడా ? మెహర్ రమేష్ దర్శకుడిగా సక్సెస్ అందుకున్నాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

Bholaa Mania First Lyrical from Bholaa Shankar On June 4th

కథ : 

హైదరాబాద్ నుండి తన చెల్లెలు (కీర్తి సురేష్) తో కలకత్తాలో అడుగుపెట్టి అక్కడ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు శంకర్ (చిరంజీవి). కలకత్తాలో అమ్మాయిలను మిస్సింగ్ కేసు వెనుక అలెగ్జాండర్(తరుణ్ అరోరా)  గ్యాంగ్ ఉందని తెలుసుకొని పోలీస్ డిపార్ట్ మెంట్ అతన్ని వెతుకుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఆ గ్యాంగ్ ను పట్టించేందుకు పోలీస్ లకు  సహాయం చేస్తాడు శంకర్.

ఆ గ్యాంగ్ ను లీడ్ చేస్తూ విమెన్ ట్రాఫికింగ్ చేసే అలెగ్జాండర్ ఇద్దరుతమ్ముళ్లను దారుణంగా హత్య చేస్తాడు శంకర్. అసలు శంకర్ ఎవరు ? తన చెల్లెలితో కలకత్తాకి ఎందుకు వచ్చాడు ? అతని రీవెంజ్ ఏంటి ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

భోళా శంకర్ పాత్రలో చిరంజీవి అలరించాడు. తన నటనతో శంకర్ దాదా ఎంబీబీస్ , శంకర్ దాదా జిందాబాద్ పాత్రలను గుర్తుచేశాడు.  యాక్షన్ , డాన్స్ , కామెడీతో మెప్పించి సినిమాకు మెయిన్ హైలైట్ అనిపించుకున్నాడు. చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ ఆకట్టుకుంది. ఆమెకి పర్ఫెక్ట్ రోల్ అని చెప్పవచ్చు. తమన్నా తన గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసింది. గతంలో చేసిన పాత్రే కావడంతో స్టైలిష్ విలన్ గా తరుణ్ అరోరా మరోసారి ఆకట్టుకున్నాడు.

మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను,  ఉత్తేజ్,  తదితరులు తమ పాత్రలతో అలరించారు.

సాంకేతిక వర్గం పనితీరు :

మహతి స్వర సాగర్ మ్యూజిక్ పరవాలేదు. రెండు పాటలు పరవాలేదనిపించాయి. యాక్షన్ సన్నివేశాలకు నేపథ్య సంగీతం బాగుంది. డడ్లీ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యింది. విజువల్స్ ఎట్రాక్ట్ చేశాయి. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ పరవాలేదు. రామ్ లక్ష్మణ్, దిలీస్ సుబ్బరాయన్, కెచ్చా మాస్టర్స్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ మెప్పించేలా ఉన్నాయి.

 మెహర్ రమేష్ కథనం విషయంలో కొన్ని మార్పులు చేసి ఉంటే బాగుండేది. కొన్ని సన్నివేశాలను బాగానే హ్యాండిల్ చేశాడు. ప్రొడక్షన్ వెల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

మెహర్ రమేష్ డైరెక్షన్ లో మెగా స్టార్ చిరు 'వేదాళం' రీమేక్ చేస్తున్నాడనే న్యూస్ వచ్చినప్పటి నుండి ఈ సినిమా మీద ఫ్యాన్స్ లో కొన్ని డిస్కషన్స్ జరిగాయి. తమిళ్ లో ఏడేళ్ళ క్రితం వచ్చిన రీవెంజ్ యాక్షన్ డ్రామాను మెహర్ రమేష్ ఇప్పుడు రీమేక్ చేయడమే బిగ్ మిస్టేక్ అనుకున్నారు అంతా. ఇన్నేళ్లకి  అదీ కోవిడ్ తర్వాత ఇలాంటి కథతో వచ్చే ముందు స్క్రిప్టింగ్ లో ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ మెహర్ ఈ రీమేక్ విషయంలో చేసిన మార్పులు పెద్దగా ఏమి లేవు. దీంతో సినిమా మొదటి షాట్ నుండి చివరి క్లైమాక్స్ వరకూ రొటీన్ గా సాగుతూ అవుట్ డెటెడ్ అనిపిస్తుంది.  తమిళ్ లో అజిత్ క్రేజ్ తో ఆడిన యాక్షన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయడం కంటే స్ట్రైట్ గా ఏదైనా కొత్త కథ రాసుకుంటే బెటర్ గా ఉండేది. 'వేదాళం' లో  యాక్షన్ , సిస్టర్ సెంటిమెంట్ , కామెడీ ఇలా అన్నీ పుష్కలంగా ఉన్నాయి. అందుకే మెహర్ రమేష్ తో పాటు మెగా స్టార్ కూడా ఈ రీమేక్ కి ఓటేసి ఉండవచ్చు. కానీ ఇప్పటి జెనెరేషన్ కి నచ్చే ఫ్రెష్ అంశాలు ఇందులో ఏమైనా ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే బాగుండేది.

ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళి అక్కడ కామన్ మెన్ లా బ్రతుకుతూ తన రీవెంజ్ కోసం ఎదురుచూసే హీరో, అతన్ని ఇష్టపడే హీరోయిన్ , కట్ చేస్తే హీరోకి ఓ ఫ్లాష్ బ్యాక్ , అందులో కింగ్ గా బ్రతకడం , మరో వైపు తమ గ్యాంగ్ పై ఎటాక్ చేస్తూ తమపై ఎవరో రీవెంజ్ తీర్చుకోవడానికి వచ్చాడని పసిగట్టి హీరోను వెతికే స్టాలిష్ విలన్.. ఈ కథతో తెలుగులోనే చాలా సినిమాలు వచ్చాయి. 'మాస్' , 'జై చిరంజీవ' ఇలా చాలా సినిమాలున్నాయి. భోళా శంకర్ లో కూడా ఇదే కథ కనిపిస్తుంది. కనీసం కథనం అయినా ఫ్రెష్ గా ఉందా ? అంటే అదీ రొటీన్ అనిపించింది. మెహర్ రమేష్ ఈ సినిమాను మక్కీ కి మక్కీ రీమేక్ చేయకుండా కొత్తగా ఆలోచించి ఫ్రెష్ సీన్స్ ఏమైనా రాసుకుంటే బాగుండేది. ముఖ్యంగా హైదరాబాద్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ పై ఇంకా వర్క్ చేయాల్సింది.

చిరంజీవి నటన , కీర్తి సురేష్ కేరెక్టర్ , తమన్నా గ్లామర్,  సాంగ్స్ పిక్చరైజేషన్ , అక్కడక్కడా పండిన కామెడీ , విజువల్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఓవరాల్ గా భోళా శంకర్ అవుట్  డెటెడ్ కథతో ఓకే అనిపిస్తుంది తప్ప పూర్తిగా మెప్పించలేదు. చిరంజీవి కోసం ఓసారి చూడొచ్చు.

రేటింగ్ : 2 /5