జీ సినిమాలు - సెప్టెంబర్ 23

Tuesday,September 22,2020 - 09:54 by Z_CLU

కిల్లర్
నటీనటులు : అర్జున్, విజయ్ ఆంటోనీ, ఆశిమా నార్వాల్, నాజర్, సీత, భగవతి పెరుమాల్, గౌతమ్, సతీష్, సంపత్ రాజ్
సంగీతం : సైమన్ కే కింగ్
సాహిత్యం , సంభాషణలు: భాష్యశ్రీ
సినిమాటోగ్రఫీ : మాక్స్
ఎడిటర్ : రిచర్డ్ కెవిన్
ఆర్ట్ : వినోద్ రాజ్ కుమార్
బ్యానర్: పారిజాత మూవీ క్రియేషన్స్‌
నిర్మాతలు: టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్
రచన & దర్శకత్వం : ఆండ్రూ లూయిస్
ఆండ్య్రూ లూయిస్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని, యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘కొలైగారన్‌’.. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌–టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. అషిమా క‌థానాయిక‌ గా నటిస్తుంది. సైమన్.కె.కింగ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా కి మాక్స్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.

==============================

ఆట
నటీనటులు : సిద్ధార్థ్ నారాయణ్, ఇలియానా డిక్రూజ్
ఇతర నటీనటులు : మున్నా, శరత్ బాబు, సునీల్, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, సాయాజీ షిండే, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అనురాధా తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : V.N.ఆదిత్య
ప్రొడ్యూసర్ : M.S. రాజు
రిలీజ్ డేట్ : 9 మే 2007
చిన్నప్పటి నుండి సినిమాలు చూస్తూ పెరిగిన శ్రీకృష్ణ, తన లైఫ్ ని కూడా హీరోలా లీడ్ చేయాలనుకుంటాడు. అంతలో సత్యతో ప్రేమలో పడిన శ్రీకృష్ణ ఆ తరవాత తన లైఫ్ లో వచ్చిన సమస్యల్ని ఎలా ఎదుర్కున్నాడు…? అనేదే ఈ సినిమా ప్రధానాంశం. ఈ సినిమాకి DSP మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది.

==========================

సుడిగాడు
నటీనటులు : అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్
ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ఆలీ, M.S. నారాయణ, రఘుబాబు, వేణు మాధవ్, చంద్ర మోహన్, చలపతి రావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్
డైరెక్టర్ : భీమనేని శ్రీనివాస రావు
ప్రొడ్యూసర్ : చంద్రశేఖర్ D రెడ్డి
రిలీజ్ డేట్ : 24 ఆగష్టు 2012
అల్లరి నరేష్ నటించిన స్పూఫ్ కామెడీ చిత్రం సుడిగాడు. భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్ టైనర్ అనిపించుకుంది. అల్లరి నరేష్, బ్రహ్మానందం కాంబినేషన్ లోని కామెడీ సీన్స్ సినిమాకే హైలెట్.

=============================

బలాదూర్
నటీనటులు : రవితేజ, అనుష్క శెట్టి
ఇతర నటీనటులు : కృష్ణ, చంద్ర మోహన్, ప్రదీప్ రావత్, సునీల్, బ్రహ్మానందం, సుమన్ శెట్టి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : K.M. రాధాకృష్ణన్
డైరెక్టర్ : K.R. ఉదయ శంకర్
ప్రొడ్యూసర్ : D. రామానాయుడు
రిలీజ్ డేట్ : 15 ఆగష్టు 2008
బాధ్యత లేకుండా తిరుగుతుంటాడు చంటి. అందుకే అస్తమానం తండ్రితో మాటలు పడుతుంటాడు. అలాంటప్పుడు కూడా చంటి పెదనాన్న రామకృష్ణ చంటికి సపోర్టివ్ గా ఉంటాడు. అందుకే చంటికి పెదనాన్న అంటే చాలా ఇష్టం. ఇదిలా ఉంటే ఉమాపతి రామకృష్ణని ఎలాగైనా ఇబ్బందుల పాలు చేయలని ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడు చంటి ఏం చేస్తాడు..? ఎలా తన కుటుంబాన్ని… రామక్రిష్ణని కాపాడుకుంటాడు..? అనేదే సినిమా ప్రధాన కథాంశం.

============================

పండగ చేస్కో
నటీనటులు : రామ్, రకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : సాయికుమార్, సోనాల్ చౌహాన్, బ్రహ్మానందం, ఆదిత్య మీనన్, రావు రమేష్, పవిత్ర లోకేష్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్
డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని
ప్రొడ్యూసర్ : రవి కిరీటి
రిలీజ్ డేట్ : 29 మే 2015
రామ్, రాకుల్ జంటగా నటించిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పండగ చేస్కో. తన కుటుంబ సభ్యుల మధ్య అగాధంలా పేరుకుపోయిన దూరాన్ని హీరో ఎలా తగ్గించాడు..? సమస్యని ఎలా సాల్వ్ చేశాడు అన్నదే ప్రధాన కథాంశం. ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==============================

బ్రూస్ లీ
నటీనటులు : రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : అరుణ్ విజయ్, కృతి కర్బందా, నదియా, సంపత్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్
డైరెక్టర్ : శ్రీను వైట్ల
ప్రొడ్యూసర్ : D.V.V. దానయ్య
రిలీజ్ డేట్ : 16 అక్టోబర్ 2015
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరియర్ లోనే డిఫెరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్రూస్ లీ. తన అక్క చదువు కోసం స్టంట్ మ్యాన్ గా మారిన యువకుడి క్యారెక్టర్ లో చెర్రీ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. మెగాస్టార్ క్యామియో సినిమాకి మరో హైలెట్.