#SarkaruVaariPaata - కీర్తి సురేష్ ఉందా లేదా?

Tuesday,September 22,2020 - 03:47 by Z_CLU

Mahesh-KeerthySuresh కాంబినేషన్ లో రాబోతున్న సినిమా సర్కారువారి పాట. పరశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై మొన్నటివరకు ఓ గాసిప్ రౌండ్స్ కొట్టింది. అదేంటంటే.. ఈ సినిమాలో Keerthy Suresh ప్లేస్ లో మరో హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నారట.

తాజాగా ఈ రూమర్ పై యూనిట్ క్లారిటీ ఇచ్చింది. తమ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా కొనసాగుతుందని, మరో ఆలోచన లేదని స్పష్టంచేసింది. అంతేకాదు.. అమెరికాలో ప్రారంభంకానున్న #SarkaruVaariPaata  ఫస్ట్ షెడ్యూల్ కోసం కీర్తిసురేష్ వీసా ప్రాసెస్ కూడా మొదలైనట్టు ప్రకటించింది.

మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, GMB ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై రాబోతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.