ZeeCinemalu - Oct 6

Monday,October 05,2020 - 10:19 by Z_CLU

ఎక్కడికి పోతావ్ చిన్నవాడా
నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ, హేబా పటేల్, అవిక గోర్
ఇతర నటీనటులు : నందితా శ్వేత, వెన్నెల కిషోర్, అన్నపూర్ణ, సత్య, సుదర్శన్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర
డైరెక్టర్ : వి. ఐ. ఆనంద్
ప్రొడ్యూసర్ : P.V. రావు
రిలీజ్ డేట్ : 18 నవంబర్ 2016
ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయిన అర్జున్(నిఖిల్) తన స్నేహితుడి అన్నయ్య కు దెయ్యం వదిలించడానికి అనుకోకుండా ఆత్మలను వదిలించే కేరళ లోని మహిశాసుర మర్దిని గుడికి వెళ్లాల్సి వస్తుంది. అలా కిషోర్(వెన్నెల కిషోర్) తో కేరళ వెళ్లిన అర్జున్ కి అమల(హెబ్బా పటేల్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. అలా పరిచయమైన అమల తన యాటిట్యూడ్ తో అర్జున్ కు దగ్గరవుతుంది. ఇంతకీ అమల అక్కడికి ఎందుకొచ్చింది? అర్జున్ కి కావాలనే ఎందుకు దగ్గరైంది? అసలు అమల ఎవరు? కేరళ వెళ్లిన అర్జున్ హైదరాబాద్ తిరిగొచ్చాక అమల గురించి ఏం తెలుసుకున్నాడు? అనేది చిత్ర కధాంశం.

==========================

చందమామ
నటీనటులు : నవదీప్, కాజల్ అగర్వాల్, శివ బాలాజీ, సింధు మీనన్
ఇతర నటీనటులు : నాగబాబు, ఉత్తేజ్, ఆహుతి ప్రసాద్, జీవా, అభినయశ్రీ
మ్యూజిక్ డైరెక్టర్ : K.M. రాధా కృష్ణన్
డైరెక్టర్ : కృష్ణవంశీ
ప్రొడ్యూసర్ : C. కళ్యాణ్, S. విజయానంద్
రిలీజ్ డేట్ : 6 సెప్టెంబర్ 2007
కలర్ ఫుల్ డైరెక్టర్ కృష్ణవంశీ నటించిన హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చందమామ. నవదీప్, శివ బాలాజీలు హీరోలుగా నటించిన ఈ సినిమాలో కాజల్, సింధు మీనన్ హీరోయిన్లుగా నటించారు. సినిమాలో భాగంగా అలరించే కామెడీ హైలెట్ గా నిలుస్తుంది.

=============================

బ్రదర్ ఆఫ్ బొమ్మాలి
నటీనటులు : అల్లరి నరేష్, కార్తీక, మోనాల్ గజ్జర్
ఇతర నటీనటులు : హర్ష వర్ధన్ రాణే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర
డైరెక్టర్ : చిన్ని కృష్ణ
ప్రొడ్యూసర్ : అమ్మి రాజు కనిమిల్లి
రిలీజ్ డేట్ : నవంబర్ 7 , 2014
కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా , కార్తీక, మోనాల్ గజ్జర్ ఇతర పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమా లో అల్లరిగా నరేష్ అక్కగా కార్తీక యాక్టింగ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. కోన వెంకట్ గా బ్రహ్మానందం కామెడీ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అల్లరి నరేష్ ఎనర్జీ తో కూడిన ఫన్నీ పెరఫార్మెన్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్, కామెడీ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.

=================================

నాగవల్లి
నటీనటులు : వెంకటేష్, అనుష్క శెట్టి
ఇతర నటీనటులు : రజినీకాంత్, జ్యోతిక, రిచా గంగోపాధ్యాయ, శ్రద్దా దాస్, కమలినీ ముఖర్జీ, పూనం కౌర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : గురుకిరణ్
డైరెక్టర్ : P. వాసు
ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్
రిలీజ్ డేట్ : 16 డిసెంబర్ 2010
విక్టరీ వెంకటేష్, అనుష్క నటించిన హారర్ కామెడీ ఎంటర్ టైనర్ నాగవల్లి. రజినీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాకి సీక్వెల్ ఈ సినిమా. అనుష్క నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది.

========================

రాక్షకుడు
నటీనటులు : సూర్య, నయనతార
ఇతర నటీనటులు : ప్రేమ్గీ అమరేన్, ప్రణీత సుభాష్, ప్రతిభాన్, రియాజ్ ఖాన్, సముథిరఖని, శరత్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా
డైరెక్టర్ : వెంకట్ ప్రభు
ప్రొడ్యూసర్ : K.E. జ్ఞానవేల్ రాజా
రిలీజ్ డేట్ : 29 మే 2015
సూర్య కరియర్ లోనే డిఫెరెంట్ సినిమాగా నిలిచింది రాక్షసుడు. సూర్య డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమా అటు తమిళం లోను, తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అయింది. ఆత్మగా నటించిన సూర్య పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

===========================

కాష్మోరా
నటీనటులు : కార్తీ, నయనతార
ఇతర నటీనటులు : సి.దివ్య, శరత్ లోహిత్ వాలా, మధుసూదన్ రావు, పట్టిమంద్రం రాజా మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : సంతోష్ నారాయణన్
డైరెక్టర్ : గోకుల్
ప్రొడ్యూసర్ : S.R. ప్రకాష్ బాబు, S.R. ప్రభు
రిలీజ్ డేట్ : 28 అక్టోబర్ 2016
ప్రజల బలహీనతను వాడుకుంటూ దొంగ బాబాగా జీవితాన్ని కొనసాగించే కాష్మోరా(కార్తీ) కు అతని మంత్రశక్తులకు లోబడిన మినిస్టర్ అండదండగా నిలుస్తాడు. అలా దొంగ బాబాగా ప్రజల నుండి డబ్బు దండుకునే కాష్మోరా అనుకోకుండా రాజ్ నాయక్(కార్తీ) అనే ఓ ప్రేతాత్మ తో ఓపాడుబడ్డ బంగ్లాలో బంధించబడతాడు. అసలింతకీ రాజ్ నాయక్ అనే ఆ ప్రేతాత్మ ఎవరు? అతను ఎందుకు ప్రేతాత్మగా మారాడు? ఆ ప్రేతాత్మకి.. ఈ కాష్మోరాకి సంబంధం ఏమిటి? చివరికి కాష్మోరా ఆ దుష్టశక్తీని ఏ శక్తితో ఎదిరించి అంతమొందించాడు? అనేది చిత్ర కథాంశం