జీ సినిమాలు (జనవరి 5th)

Wednesday,January 04,2017 - 10:30 by Z_CLU

siri-puram-chinnodu-1

 

నటీ నటులు : అర్జున్ , రజని

ఇతర నటీనటులు : దగ్గుబాటి రాజా, జీవిత, రమణమూర్తి, విద్యా సాగర్, తనికెళ్ళ భరణి, సాక్షి రంగారావు, జె.వి.సోమయాజులు, వై.విజయ.

సంగీతం : చక్రవర్తి

డైరెక్టర్ : రవిరాజా పినిశెట్టి

నిర్మాత : G.V.K. రాజు

విడుదల తేదీ – 1988

కరాటేతో పాటు భారీ ఫైట్స్ కు అప్పటికే కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు హీరో అర్జున్. అలాంటి హీరోను ఫ్యామిలీ డ్రామాలో ఇరికించడం కాస్త కష్టమైన పనే. కానీ రవిరాజా పినిశెట్టి మాత్రం ఏమాత్రం భయపడలేదు. ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కుటుంబకథాచిత్రాన్ని ఎంచుకున్న రవిరాజా… అందులో అర్జున్ ను హీరోగా తీసుకొని అప్పట్లో పెద్ద ప్రయోగమే చేశారు. అయితే అది విజయవంతం అయింది. అప్పట్నుంచి అర్జున్ ఫ్యామిలీ హీరోగా కూడా మారారు. ఈ సినిమా తర్వాత రవిరాజా పినిశెట్టి, అర్జున్ కాంబినేషన్ లో మరిన్ని విజయవంతమైన చిత్రాలు వచ్చాయి.

——————————————————————

poola-rangadu

నటీ నటులు : అక్కినేని నాగేశ్వర రావు, జమున
ఇతర నటీనటులు : విజయ నిర్మల, చిత్తూర్ వి. నాగయ్య, గుమ్మడి, అల్లు రామలింగయ్య, శోభన్ బాబు
మ్యూజిక్ డైరెక్టర్ : సాలూరి రాజేశ్వర రావు
డైరెక్టర్ : ఆదుర్తి సుబ్బారావు
ప్రొడ్యూసర్ : D. మధుసూదన రావు
రిలీజ్ డేట్ : 24 నవంబర్ 1967

ANR, జమున నటించిన క్లాసిక్ ఎంటర్ టైనర్ ‘Beyond This Place’ అనే నవల ఆధారంగా తెరకెక్కింది. నిజాయితీనే నమ్ముకుని బ్రతికే పూలరంగడు చేయని నేరానికి జైలు పాలైన తన తండ్రిని, నిర్దోషి అని ఎలా నిరూపించాడు అనేదే ప్రధాన కథాంశం. ఈ సినిమాకి సాలూరి రాజేశ్వర రావు సంగీతం అందించారు.

——————————————————————

pavithra-prema

 

హీరోహీరోయిన్లు – బాలకృష్ణ, లైలా

నటీనటులు – రోషిని, కోట శ్రీనివాసరావు, సుధాకర్, అలీ, పొన్నాంబలం

సంగీతం – కోటి

దర్శకత్వం – ముత్యాల సుబ్బయ్య

విడుదల – 1998, june 4

 

నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి 1997లో పెద్దన్నయ్య, ముద్దుల మొగుడు అనే రెండు సూపర్ హిట్స్ వచ్చాయి. వాటి తర్వాత బాలయ్య సినిమాలపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అలా 1998లో భారీ అంచనాల మధ్య వచ్చిన చిత్రం పవిత్ర ప్రేమ. అప్పటికే యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న లైలాను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉంటుంది.

——————————————————————

ranga-the-donga-1

హీరోహీరోయిన్లు – శ్రీకాంత్, విమలా రామన్
నటీనటులు – రమ్యకృష్ణ, తెలంగాణ శకుంతల, జీవీ, నాగబాబు
సంగీతం – చక్రి
దర్శకత్వం – జీవీ సుధాకర్ నాయుడు
విడుదల తేదీ – 2010, డిసెంబర్ 30

ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించిన జీవీ… దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా రంగ ది దొంగ. అప్పటికే దర్శకుడిగా మారి నితిన్ తో ఓ సినిమా తీసిన జీవీ… ఈసారి ఓ విభిన్న కథాంశంతో శ్రీకాంత్ ను హీరోగా పెట్టి రంగ ది దొంగ సినిమాను తెరకెక్కించాడు. సినిమాలో విమలారామన్ పోలీస్ గా కనిపిస్తే… మరో కీలకపాత్రలో రమ్యకృష్ణ నటించింది. తెరపై భయంకరమైన విలనిజం చూపించిన జీవీ… దర్శకుడిగా మాత్రం ఈ సినిమాలో మంచి కామెడీ పండించాడు. 2010లో విడుదలైన ఈ సినిమాకు చక్రి సంగీతం అందించాడు.

——————————————————————

ganesh-just-ganesh

హీరోహీరోయిన్లు – రామ్,కాజల్

నటీనటులు – పూనమ్ కౌర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం

సంగీతం – మిక్కీ జె మేయర్

దర్శకత్వం – శరవణన్

విడుదల తేదీ – 2009

 

రామ్ కాజల్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘గణేష్ జస్ట్ గణేష్’. 2009 లో విడుదలైన ఈ సినిమా యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది. మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలైట్. చిన్న పిల్లలతో గణేష్ చేసే హంగామా , కాజల్-రామ్ మధ్య వచ్చే లవ్ సీన్స్ బాగా అలరిస్తాయి. అబ్బూరి రవి అందించిన మాటలు సినిమాకు ప్లస్, ముఖ్యంగా క్లైమాక్స్ లో మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. కాజల్ కుటుంబ సభ్యుల మధ్య మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు అందరినీ హత్తుకుంటాయి.

——————————————————————

police-story

హీరో – సాయికుమార్
నటీనటులు – రాక్ లైన్ వెంకటేశ్, పీజే శర్మ, సన, శోభరాజ్, పొన్నాంబలం
సంగీతం – ఆర్పీ పట్నాయక్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం – థ్రిల్లర్ ముంజు
విడుదల తేదీ – 1996

అప్పటికే సౌత్ లో పెద్ద హిట్ అయిన పోలీస్ స్టోరీకి సీక్వెల్ గా పోలీస్ స్టోరీ-2ను తెరకెక్కించారు. పోలీస్ స్టోరీ సినిమాకు పనిచేసిన టీం అంతా దాదాపుగా ఈ సీక్వెల్ కు కూడా పనిచేశారు. ఇప్పటికీ సాయికుమార్ కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే అగ్ని పాత్ర ఈ సినిమాలోనిదే. యాక్షన్ సినిమాలు, అదిరిపోయే మాస్ డైలాగులు కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటిది.

——————————————————————

nenu-meeku-telusa

 

నటీ నటులు : మంచు మనోజ్ స్నేహ ఉల్లాల్
ఇతర నటీనటులు : రియా సేన్, నాజర్, సునీల్, ఉత్తేజ్, బ్రహ్మానందం తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : అచ్చు & ధరన్
డైరెక్టర్ : అజయ్ శాస్త్రి
ప్రొడ్యూసర్ : లక్ష్మి మంచు
రిలీజ్ డేట్ : 2008

మంచు మనోజ్, స్నేహ ఉల్లాల్ జంటగా నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘నేను మీకు తెలుసా..?’ ఒక ఆక్సిడెంట్ లో తండ్రిని కోల్పోయిన ఆదిత్య తన బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం షార్ట్ టైం మెమొరీ పేషెంట్ లా మారతాడు. తన రెగ్యులర్ ఆక్టివిటీస్ మర్చిపోకుండా ఉండటం కోసం, ఒక ఆడియో క్యాసెట్ లో ఎప్పటికపుడు రికార్డు చేసుకునే ఆదిత్య లైఫ్ ఎలాంటి మలుపులు తిరుగుతుంది. అసలు తనకు జరిగింది ఆక్సిడెంటా..? లేక హత్యా ప్రయత్నమా..? అనే అంశాలతో ముదిపడిందే ఈ సినిమా. షార్ట్ టైం మెమొరీ పేషెంట్ గా మనోజ్ నటన ఈ సినిమాలో హైలెట్.