మూడు సినిమాల తర్వాతే....

Wednesday,January 04,2017 - 08:00 by Z_CLU

ఇయర్ ఎండింగ్ లో ‘ధృవ’తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రెజెంట్   ‘ఖైదీ నంబర్ 150’ సినిమా పై ఫోకస్ పెట్టాడు. చిరు రి ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మించిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడం తో ప్రమోషన్స్ లో నిర్మాతగా ఫుల్ బిజీ అయిపోయాడు చెర్రీ.

  ‘ఖైదీ నంబర్ 150’ రిలీజ్ తర్వాతే సుకుమార్ డైరెక్షన్ లో నటించే సినిమా ను సెట్స్ పైకి తీసుకురావాలని డిసైడ్ అయ్యాడు చెర్రీ. ఈ సినిమాతో పాటు కొరటాల శివ, త్రివిక్రమ్ లతో మరో రెండు సినిమాలను కూడా లైన్ లో పెట్టిన మెగా పవర్ స్టార్ ఈ ఇయర్ జూన్, జులై వరకూ సుకుమార్ సినిమాను పూర్తి చేసి ఆ వెంటనే కొరటాల తో సెట్స్ పైకి వెళ్లాలని చూస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి చేసి బాబాయ్ పవన్ కళ్యాణ్ నిర్మాణం లో త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతాడట . ప్రెజెంట్ ఈ మూడు సినిమాలు మాత్రమే  సైన్ చేసిన చెర్రీ మిగతా సినిమాల సంగతి ఈ సినిమాలు పూర్తి చేశాకే ఆలోచిస్తాడట. ఈ లెక్కన 2017 తో పాటు 2018 లో కూడా ప్లాన్ చేసుకొని హీరోగా ఫుల్ బిజీ అవ్వబోతున్నారు చెర్రీ …