జీ సినిమాలు (డిసెంబర్ 28th)

Tuesday,December 27,2016 - 10:30 by Z_CLU

prema-mandiram

 

నటీనటులు : అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద
ఇతర నటీనటులు : గుమ్మడి, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, నగేష్, చలం, సారథి, జయప్రద, అంబిక తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : K.V. మహదేవన్
డైరెక్టర్ : దాసరి నారాయణ రావు
ప్రొడ్యూసర్ : డి. రామా నాయుడు
రిలేజ్ డేట్ : 1981

ఆకాశ హర్మ్యంలో ఉన్న జమీందారీ వ్యవస్థకు, నేలకున్న దేవదాసీ వ్యవస్థకు మధ్య జరిగే ఆసక్తికరమైన ప్రేమకథే ప్రేమ మందిరం. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం హైలెట్ గా నిలిచింది.

——————————————————————

mundadugu

నటీ నటులు : సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద
ఇతర నటీనటులు : కైకాల సత్యనారాయణ, రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య, శివకృష్ణ, గిరిబాబు, రాజేంద్ర ప్రసాద్, గుమ్మడి, నూతన్ ప్రసాద్, సూర్య కాంతం తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : K. చక్రవర్తి
డైరెక్టర్ : K. బాపయ్య
ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు
రిలీజ్ డేట్ : 1983

శోభన్ బాబు, కృష్ణ నటించిన మల్టీ స్టారర్ యాక్షన్ ఎంటర్ టైనర్ ముందడుగు. శ్రీదేవి, జయప్రద హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోను బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబులిద్దరూ అన్నాదమ్ములని తెలుసుకునే సన్నివేశం సినిమాకే హైలెట్. ఈ సినిమాకి చక్రవర్తి సంగీతం అందించాడు.

——————————————————————

suri-gadu

నటీనటులు : సురేష్, యమున
ఇతర నటీనటులు : దాసరి నారాయణ రావు, సుజాత, సురేష్, గొల్లపూడి, వేలు, రాళ్ళపల్లి, కాంతారావు, బ్రహ్మానందం, బాబూ మోహన్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : వాసూ రావు
డైరెక్టర్ : దాసరి నారాయణ రావు
ప్రొడ్యూసర్ : డి. రామా నాయుడు
రిలేజ్ డేట్: 1992

కష్టపడి పెంచిన తలిదండ్రులను కన్నా బిడ్డలే పట్టించుకోకపోతే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు తెరకెక్కించారు డైరెక్టర్ దాసరి నారాయణరావు. ఈ సినిమాలో తండ్రి పాత్ర కూడా స్వయంగా ఆయనే పోషించారు. ఈ సినిమాలో ‘ఒకే ఒక ఆశ’ అంటూ సాగే పాట సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది.

——————————————————————

Trisha, Jeeva in Chirunavvula Chirujallu Movie Wallpapers

నటీనటులు : జీవా, త్రిష కృష్ణన్
ఇతర నటీనటులు : వినయ్, సంతానం, నాజర్, జగన్, T.M. కార్తీక్, అభినయ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్
డైరెక్టర్ : I. అహ్మద్
ప్రొడ్యూసర్ : తమిళ్ కుమారన్
రిలీజ్ డేట్ : 20 డిసెంబర్ 2013

జీవా, త్రిష నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిరునవ్వుల చిరుజల్లు. హారిస్ జయరాజ్ అందించిన సంగీతం సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది.

——————————————————————

raam-nithin

నటీనటులు : నితిన్, జెనీలియా డిసౌజా
ఇతర నటీనటులు : కృష్ణంరాజు, బ్రహ్మానందం, హర్షిత భట్, అతుల్ కులకర్ణి, రాజ్యలక్ష్మి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా
డైరెక్టర్ : N. శంకర్
ప్రొడ్యూసర్ : సుధాకర్ రెడ్డి
రిలీజ్ డేట్ : 30 మార్చి 2006

అల్లరి బుల్లోడు, ధైర్యం తరవాత నితిన్ నటించిన కమర్షియల్ ఎంటర్ టైనర్ రామ్. నితిన్ సైకిల్ చాంపియన్ గా నటించిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. సీనియర్ నటుడు కృష్ణంరాజు ఒక కీలక పాత్రలో నటించారు. డాక్టర్ చక్రవర్తిగా బ్రహ్మానందం నటన సినిమాకే హైలెట్.

——————————————————————

amaravathi

నటీ నటులు : స్నేహ, భూమిక, తారకరత్న, సింధూర గద్దె, రవి బాబు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర
రచన, స్క్రీన్ ప్లే ,డైరెక్టర్ : రవి బాబు
ప్రొడ్యూసర్ : ఆనంద్ ప్రసాద్
రిలీజ్ డేట్ : 3 డిసెంబర్ 2009

థ్రిల్లర్ సస్పెన్స్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా నిలిచే దర్శకుడు రవి బాబు తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘అమరావతి’. ఈ చిత్రం లో భూమిక, స్నేహ ల నటన, సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలు, రవి బాబు టేకింగ్, నందమూరి తారక రత్న క్యారెక్టర్ సినిమాకు హైలైట్స్. ఈ సినిమా కోసం తొలి సారిగా విలన్ అవతారమెత్తిన తారకరత్న ఈ చిత్రం లో నటన కు గాను నంది అవార్డు అందుకున్నారు. ఆధ్యాంతం సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలతో ఈ సినిమా అలరిస్తుంది.

——————————————————————

nakili

నటీనటులు : విజయ్ అంటోని, సిద్ధార్థ్ వేణు గోపాల్
ఇతర నటీనటులు : రూప మంజరి, అనుయ భగవత్, విజయ్, విభ నటరాజన్, కృష్ణమూర్తి, ప్రమోద్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : విజయ్ అంటోని
డైరెక్టర్ : జీవ శంకర్
ప్రొడ్యూసర్ : ఫాతిమా విజయ్ అంటోని
రిలేజ్ డేట్ : 15 ఆగష్టు 2012

విజయ్ అంటోని హీరోగా జీవ శంకర్ డైరేక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ నకిలీ. చిన్నప్పుడే తల్లిని చంపిన హత్యా నేరంలో జైలు కెళ్ళిన కుర్రాడు, జైలునుండి బయటికి వచ్చి ఏం చేశాడు..? అతని జీవితం ఏ మలుపు తిరిగింది అనేదే ప్రధాన కథాంశం.