గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో రివ్యూ

Tuesday,December 27,2016 - 07:29 by Z_CLU

బాలకృష్ణ 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. సంక్రాంతి రిలీజ్ కి ఆల్ సెట్ అయిన గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటోంది. చారిత్రక కథాశంతో తెరకెక్కిన ఈ సినిమాలో మొత్తం 5 పాటలను ప్లాన్ చేసిన క్రిష్, రెండు పాటలను రొమాంటిక్ ఎలిమెంట్స్ కి కేటాయించి తక్కిన మూడింటిని మాత్రం ఎగ్జాక్ట్ గా తన స్టోరీ ప్లాట్ కి వాడుకున్నాడు. చిరంతన్ భట్ కంపోజ్ చేసిన శాతకర్ణి ఆడియో  రివ్యూ ఎక్స్ క్లూజివ్ గా మీకోసం…

gps-1

ఎకిమీద : ఎకిమీద సాంగ్ వింటుంటే డెఫినెట్ మాడరన్ టెక్నాలజీతో హిస్టారికల్ ఫీల్ తో తెరకెక్కిన డ్యూయట్ అని అర్థమైపోతుంది. స్లో పేజ్ లో సాగే ఈ సాంగ్, ఎవరినైనా హమ్ చేసేలా చేస్తుంది.

gps-2

గణ గణ గణ గణ : యుద్ధ నేపథ్యంలో సందర్భానుసారంగా వచ్చే పాట ఇది. గౌతమీపుత్రుని సమక్షంలో గ్రూప్ సాంగ్ లా ఉండే ఈ పాట, డెఫ్ఫినేట్ గా బోలెడంత మంది డ్యాన్సర్స్, సైనికుల మధ్య విజువలైజ్ చేసి ఉంటారు.

gps-3

మృగనయన : క్లాసిక్ రొమాంటిక్ సాంగ్. స్లో పేజ్ లో అల్టిమేట్ ట్యూన్ తో సాగిపోయే ఈ పాటని ఎవరైనా కాస్తంత కళ్ళు మూసుకుంటే చాలు, అద్భుతమైన విజువల్స్ కళ్ళ ముందు కదులుతాయి. బాలయ్య కరియర్ లోని బెస్ట్ మెలోడీస్ లో ఈ సాంగ్ కూడా చేరిపోయినట్టే.

gps-4

సాహో సార్వభౌమ : గౌతమీసుత శాతకర్ణి గొప్పతనం రిజిస్టర్ అయ్యేలా ట్యూన్ అయిన సాంగ్ ఇది. వింటున్నంత సేపు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. బహుపరాక్ అంటూ సాగే ఈ పాట సినిమాకే హైలెట్ గా నిలవడం గ్యారంటీ. ఈ పాట లిరిక్స్ ని కాస్తంత జాగ్రత్తగా గమనిస్తే, మ్యూజిక్ డైరెక్టర్ చిరాంతన్ భట్ సినిమా కాన్సెప్ట్ లో ఎంతగా ఇన్వాల్వ్ అయ్యాడో అర్థమౌతుంది.

gps-5

సింహము పై లంఖించెను : ఎప్పుడో అంతరించి పోయిన బుర్రకథని మరోసారి ఎలివేట్ చేశాడు క్రిష్. కేవలం బుర్రకథనే కాదు. గౌతమీపుత్ర సుతుని గొప్పతనాన్ని, ఆయన బాల్యం నుండి మొదలుపెడితే వివాహం వరకు, ఆ తరవాత ఆయన జీవితంలో ఎదురైన ఒక సంక్లిష్ట పరిస్థితి వరకు ఈ కథ నడుస్తూనే ఉంటుంది. ఇక ఆ తరవాత కథ ఏ మలుపు తిరిగిందో సినిమా చూసే తెలుసుకోవాలి.

జీ సినిమాలు రివ్యూ…

ఓవరాల్ గా గౌతమీపుత్ర శాతకర్ణి పాటలు సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లాలా ఉన్నాయి. ప్రతి కంపోజిషన్ దేనికనే విభిన్నంగా ఉంది. ఇలాంటి సినిమాలకు ట్యూన్స్ చేయడం చాలా కష్టమైన-క్లిష్టమైన పని. అలాంటి పనిని చిరంతన్ భట్ వందకు వందశాతం పూర్తిచేయగలిగాడు. ఇక వెండితెరపై ఈ పాటల పిక్చరైజేషన్ చూసి ఆనందించడమే బ్యాలెన్స్.