Zee5 Recce బ్లాక్ బస్టర్ సిరీస్

Wednesday,June 22,2022 - 04:01 by Z_CLU

జీ 5 ఒరిజినల్స్ నుండి వచ్చిన సిరీస్ లన్నీ సూపర్ హిట్స్ సాధిస్తూ వ్యూవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇటివలే జీ5 లో రిలీజయిన ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’,’గాలి వాన’ సిరీస్ లు మంచి వ్యూస్ సాధించి సూపర్ హిట్స్ గా నిలిచాయి. వాటి తర్వాత లేటెస్ట్ గా రిలీజైన ‘రెక్కీ’ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటూ భారీ వ్యూస్ కొల్లగొడుతుంది.

పోలూరు కృష్ణ దర్శకత్వంలో తాడిపత్రిలో జరిగిన సెన్సేషనల్ మర్డర్ మిస్టరీ కథతో  క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘రెక్కీ’ ఆధ్యంతం ఉత్కంట భరితంగా సాగుతూ ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తూ మెప్పించింది. జూన్ 17 న స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ తక్కువ టైంలోనే 40 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు దాటేసి బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది. అలాగే IMDb సంస్థ నుండి 8 హై రేటింగ్ దక్కించుకుంది రెక్కీ.

శ్రీరామ్, శివబాలాజీ , ఆడుకాలం నరేన్ , సమ్మెట గాంధి తమ నటనతో ఆకట్టుకొని ‘రెక్కీ’ ని ఆసక్తిగా ముందుకు నడిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు ఒరిజినల్స్ లో ‘రెక్కీ’ ది బెస్ట్ సిరీస్ అంటూ చూసిన ఆడియన్స్  సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ దర్శకుడిని టీంను అభినందిస్తూ రికమండ్ చేస్తున్నారు.

 

 

“Recce” Recommended must watch:

https://zee5.onelink.me/RlQq/Recce