Pelli SandaD జూన్ 24న జీ5 లో

Wednesday,June 22,2022 - 05:05 by Z_CLU

Blockbuster musical rom-com ‘Pelli SandaD’ is set to stream from June 24 on ZEE5

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందిన ‘పెళ్లి సంద‌D’ఎట్టకేలకు OTT లో రిలీజవుతోంది. ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల రూప‌క‌ల్ప‌న‌లో త‌న మేజిక్‌ను చూపించిన రాఘవేంద్రరావు న‌టుడిగా మారి తన శిష్యురాలు గౌరి రోణంకి దర్శకురాలిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ‘పెళ్లిసంద‌D’జీ5 లో జూన్ 24న స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించి బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు రాబట్టి సూపర్ హిట్ సాధించింది.

రోషన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా పరిచయమైన ఈ సినిమా థియేటర్స్ లో రిలీజై మంచి వసూళ్ళు రాబట్టింది. ముఖ్యంగా దర్శకేంద్రుడి సాంగ్స్ పిక్చరైజేషన్ , కీరవాణి మ్యూజిక్ , శ్రీ లీల గ్లామర్ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా నిలిచి అందరినీ ఆకట్టుకుంది. పాటల కోసమే ఈ సినిమాను థియేటర్స్ లో మళ్ళీ మళ్ళీ చూసిన ఆడియన్స్ ఉన్నారు. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ కామెడీ , రోషన్ -శ్రీలీల లవ్ ట్రాక్ , రాఘవేంద్రరావు స్టోరీ నెరేషన్ , బ్యూటిఫుల్ సాంగ్స్ , ఆకట్టుకునే పిక్చరైజేషన్ సినిమాలో హైలైట్స్ గా చెప్పుకోవచ్చు.

ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘పెళ్లి సందD’ను జీ5 లో జూన్ 24 నుండి వీక్షించండి.

మీ ఇంట్లో పెళ్లి సందడి చేయడనికి సర్వం సిద్ధం! ఈ జూన్ 24వ తేదీన అందరూ ఆహ్వానితులే!

 

https://www.instagram.com/p/CfGPfF8AEN4/

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics