జీ సినిమాలు ( మార్చ్ 29th)

Tuesday,March 28,2017 - 10:07 by Z_CLU

నటీనటులు : జయసుధ, అనంత్ నాగ్, మురళి మోహన్

ఇతర నటీనటులు : అల్లు రామలింగయ్య, సత్యనారాయణ కైకాల, గిరిబాబు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సత్య

డైరెక్టర్ : k. రాఘవేంద్ర రావు

ప్రొడ్యూసర్ : D. మధుసూదన రావు

రిలీజ్ డేట్ : 1977

జయసుధ, మురళీ మిహన్ జంటగా నటించిన ఇమోషనల్ ఎంటర్ టైనర్ ప్రేమలేఖలు. ప్రేమకు, నమ్మకానికి మధ్య ఉండే విలువల్ని అతి సున్నితంగా చెప్పిన సినిమా ప్రేమలేఖలు. K. రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా యద్దనపూడి సులోచనా రాణి నవల ఆధారంగా తెరకెక్కింది. దర్శకేంద్రుని మార్క్ తో ఎంటర్ టైనింగ్ గా సాగే స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ఈ సినిమాకి సత్య మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

=============================================================================

నటీనటులు : అర్జున్, మనీషా కోయిరాలా

ఇతర నటీనటులు : సుష్మితా సేన్, రఘువరన్, వడివేలు, మణివణ్ణన్, విజయ్ కుమార్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్

డైరెక్టర్ : శంకర్

ప్రొడ్యూసర్ : శంకర్, మాదేశ్

రిలీజ్ డేట్ : 7 నవంబర్ 1999

అర్జున్, మనీషా కొయిరాలా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ ఒకే ఒక్కడు. ఒక్క రోజు ముఖ్యమంత్రిగా రాష్ట్ర పరిపాలనా పగ్గాలను చేపట్టే యువకుడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి A.R. రెహ్మాన్ సంగీతం పెద్ద ఎసెట్.

============================================================================

నటీనటులు : అల్లు అర్జున్, అమలా పాల్, కేథరిన్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, తులసి, నాజర్, ప్రగతి, ఆలీ, షవార్ ఆలీ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : పూరి జగన్నాథ్

ప్రొడ్యూసర్ : బండ్ల గణేష్

రిలీజ్ డేట్ : 31 మే, 2013

అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ హీరోగా తెరకెక్కిన అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇద్దరమ్మాయిలతో. బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమా బన్ని కరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిర్మించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ఎసెట్.

===========================================================================

నటీనటులు : అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి, జమున

ఇతర నటీనటులు : కొంగర జగ్గయ్య, R. నాగేశ్వర రావు, రేలంగి వెంకట రామయ్య, సూర్యకాంతం, మడాలి కృష్ణమూర్తి, అల్లు రామలింగయ్య తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : పెండ్యాల నాగేశ్వర రావు

డైరెక్టర్ : కదిరి వెంకట రెడ్డి

ప్రొడ్యూసర్ : D. మధుసూదన రావు

రిలీజ్ డేట్ : 1 అక్టోబర్ 1955

అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి, జమున నటించిన ఇమోషనల్ ఎంటర్ టైనర్ దొంగ రాముడు. తన తల్లిని బ్రతికించుకునే క్రమంలో దొంగగా మారిన ఒక వ్యక్తి జీవితంలోని ఇమోషనల్ ఆంగిల్ ని అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు కదిరి వెంకట రెడ్డి. అక్కినేని నాగేశ్వర రావు పర్ఫామెన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

==============================================================================

నటీనటులు  – నాగచైతన్య, కృతి సనోన్

ఇతర నటీనటులు – బ్రహ్మానందం, రవిబాబు, పోసాని, సప్తగిరి, ప్రవీణ్

మ్యూజిక్ డైరెక్టర్  – సన్నీ

డైరెక్టర్ – సుధీర్ వర్మ

రిలీజ్ డేట్  – 2015, ఏప్రిల్ 24

స్వామిరారా సినిమాతో అప్పటికే సూపర్ హిట్ అందుకున్న సుధీర్ వర్మకు పిలిచిమరీ ఛాన్స్ ఇచ్చాడు నాగచైతన్య. స్వామిరారా సినిమాతో తన మార్క్ ఏంటో చూపించిన సుధీర్ వర్మ… తన  రెండో ప్రయత్నంగా తీసిన దోచెయ్ సినిమాకు కూడా అదే ఫార్మాట్ ఫాలో అయ్యాడు. మహేష్ సరసన వన్-నేనొక్కడినే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి సనోన్ కు ఇది రెండో సినిమా. అలా వీళ్లందరి కాంబోలో తెరకెక్కిన దోచెయ్ సినిమా కుర్రాళ్లను బాగానే ఎట్రాక్ట్ చేసింది. సన్నీ సంగీతం అదనపు ఆకర్షణ. క్లయిమాక్స్ కు ముందొచ్చే బ్రహ్మానందం కామెడీ టోటల్ సినిమాకే హైలెట్.

============================================================================

నటీ నటులు : నందమూరి బాలకృష్ణ, స్నేహ, టాబూ

ఇతర నటీనటులు : అర్చన, మేఘనా నాయుడు, సుహాసిని, మోహన్ బాబు, K.విశ్వనాథ్, బ్రహ్మానందం, సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం

మ్యూజిక్ డైరెక్టర్ : కీరవాణి

డైరెక్టర్ : రాఘవేంద్ర రావు

నిర్మాత : కృష్ణమోహన రావు

రిలీజ్ డేట్ : 30 మే 2008

1957 లో NTR నటించిన పాండురంగ మహాత్యం సినిమాకి రీమేక్ ఈ “పాండు రంగడు” సినిమా. అన్నమయ్య, శ్రీరామ దాసు లాంటి సినిమాల తర్వాత బాలకృష్ణ తో కూడా ఒక భక్తిరస చిత్రం చేయాలనుకున్న రాఘవేంద్ర రావు ఈ సినిమాని తెరకెక్కించారు. పాండురంగనిగా బాలకృష్ణ నటన, దానికి తోడు కీరవాణి సంగీతం ప్రతీది సినిమాకు ప్రత్యేక ఆకర్షణే. బాలయ్య సరసన స్నేహ, టాబూ హీరోయిన్ లుగా నటించారు.

=============================================================================

నటీ నటులు : ఉదయ్ కిరణ్, దివ్య

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ముమైత్ ఖాన్, నిగళ్ గళ్ రవి, సత్య రాజ్, రఘుబాబు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : D. లక్ష్మణ్

డైరెక్టర్ : రాజ్ కపూర్

ప్రొడ్యూసర్ : పొలిశెట్టి రామ్ బాబు

రిలీజ్ డేట్ : 29 ఫిబ్రవరి 2008

ఉదయ కిరణ్ చేసిన సినిమాల్లో ప్రేమ కథలే ఎక్కువ. లవర్ బాయ్ ఇమేజ్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న టైం లో ఫాదర్ సెంటిమెంట్ తో చేసిన యాక్షన్ ఎంటర్ టైనర్ లక్ష్మీ పుత్రుడు. మతి స్థిమితం తప్పిన తన తండ్రి కోసం, హీరో ఏం చేశాడన్నదే ప్రధాన కథాంశం.