ఉగాది సినిమా సందడి

Wednesday,March 29,2017 - 09:00 by Z_CLU

ప్రతీ ఏడాది ఉగాది లాగే ఈ ఏడాది కూడా కొన్ని తెలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి..మరి ఉగాది కి సందడి చేయబోతున్న ఆ సినిమాల పై ఓ లుక్కేద్దాం..

 

లాస్ట్ ఇయర్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తో ఉగాది కి బాగా సందడి చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఇయర్ కూడా ‘కాటమరాయుడు’ సినిమాతో ఉగాది కి భారీ హంగామా చేశాడు. నిజానికి ఈ సినిమాతో ఉగాది కి ముందే అభిమానుల్లో పండగ వాతావరణం తీసుకొచ్చాడు పవన్..

నయనతార కూడా ఈ ఏడాది ఉగాది కి తన ‘డోర’ సినిమాతో ఎంటర్టైన్ చేయబోతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ శుక్రవారమే థియేటర్స్ లోకి రాబోతుంది..ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో మరో సారి తెలుగు ప్రేక్షకులకి థ్రిల్ కలిగించి మరో సూపర్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతుంది నయన్..

ఇషాన్ ను హీరోగా పరిచయం చేస్తూ పూరి తెరకెక్కించిన ‘రోగ్’ సినిమా కూడా ఉగాది బరిలో నిలిచి థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా మార్చ్ 31న థియేటర్స్ లోకి రానుంది.

సమ్మర్ సీజన్ పైగా ఉగాది కావడంతో కొత్త వాళ్ళతో తెరకెక్కిన ‘సినీ మహల్’ సినిమా కూడా ఈ శుక్రవారం థియేటర్స్లోకి రానుంది.. రేయాన్ రాహుల్, తేజస్విని హీరో హీరోయిన్స్ గా సరికొత్త కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఉగాది బరిలో తెలుగు ఆడియన్స్ ఎలా ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి.

ఉగాదికి ఓ డిఫెరెంట్ సినిమాతో ‘గురు’గా బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు విక్టరీ వెంకటేష్. ఈ సినిమాతో ఫస్ట్ టైం కోచ్ గా ఎంటర్టైన్ చేయబోతున్న వెంకీ అందుకు ఉగాది ను సెలెక్ట్ చేసుకొని మార్చ్ 31న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.