Bimbisara డబుల్ బ్లాక్ బస్టర్
Tuesday,August 09,2022 - 02:11 by Z_CLU
Kalyan Ram’s Bimbisara collected 18 crores share in telugu states
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వసిష్ఠ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘బింబిసార’ భారీ కలెక్షన్స్ కొల్లగొడుతూ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంటోంది. శుక్రవారం రిలీజైన ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ప్రస్తుతం ప్రాఫిట్ జోన్ లోకి ఎంటరైన ఈ సినిమా నాలుగు రోజులకు గానూ తెలుగు రాష్ట్రాల్లో 18.2 కోట్ల షేర్ రాబట్టి బిగ్గెస్ట్ హిట్ రేంజ్ వైపు దూసుకెళ్తోంది.
దర్శకుడు వసిష్ఠ ఈ కథను చెప్పిన విధానానికి , కళ్యాణ్ రామ్ నటన , కీరవాణి మ్యూజిక్ కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా సినిమాలో పాప సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. చిన్న పాపతో కళ్యాణ్ రామ్ సీన్స్ కొన్నే ఉన్నప్పటికీ ఆ సీన్స్ వచ్చినప్పుడు మేజిక్ క్రియేట్ అయింది. ఈ ఎలిమెంట్ ఆడియన్స్ కి సినిమా బాగా కనెక్ట్ అయ్యేలా చేసింది.
ఇక కీరవాణి సంగీతం కూడా సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలకు కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఎంతో హెల్ప్ అయింది. ఓవరాల్ గా కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ థియేటర్స్ లో ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ ఆకట్టుకుంటుంది. మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాతో సందడి మొదలైంది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా భారీ వసూళ్ళు సాధించి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం ఖాయమనిపిస్తుంది.
- Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics