జీ సినిమాలు (ఏప్రిల్ 1)

Tuesday,March 31,2020 - 09:02 by Z_CLU

ఆచారి అమెరికాయాత్ర
నటీనటులు : మంచు విష్ణు, ప్రగ్యా జైస్వాల్
ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, రాజా రవీంద్ర, ఠాకూర్ అనూప్ సింగ్
మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.S. థమన్
డైరెక్టర్ : G. నాగేశ్వర రెడ్డి
ప్రొడ్యూసర్స్ : కీర్తి చౌదరి, కిట్టు
రిలీజ్ డేట్ : 27 ఏప్రిల్ 2018

కృష్ణమా చారి( విష్ణు), అప్పలా చారి (బ్రహ్మానందం) గురు శిష్యులు… తమ టీంతో కలిసి పూజలు చేస్తుంటారు.అయితే ఓసారి చక్రపాణి(కోట శ్రీనివాసరావు)అనే పెద్ద మనిషి ఇంట్లో హోమం చేయించడానికి వెళ్ళినప్పుడు అమెరికా నుంచి వచ్చిన ఆయన మనవరాలు రేణుక(ప్రగ్యా జైస్వాల్)తో ప్రేమలో పడతాడు కృష్ణమాచార్య. అదే సమయంలో రేణుక మీద హత్య ప్రయత్నం జరుగుతుంది. హోమం చివరి రోజు అనుకోకుండా చక్రపాణి చనిపోతాడు. రేణుక కూడా కనుమరుగై పోతుంది. అయితే రేణుక అమెరికా వెళ్లిందని తెలుసుకుని అప్పలాచారికి ఉద్యోగ ఆశ చూపించి ఎట్టకేలకు తన టీంతో కలిసి అమెరికా వెళతాడు కృష్ణమాచార్య. అలా రేణుక ను కలుసుకోవడానికి అమెరికాకు వెళ్ళిన కృష్ణమాచారి రేణుకకు విక్కీతో పెళ్లి జరగబోతుందని తెలుసుకుంటాడు. ఇక విక్కీ నుండి రేణుకను ఎలా కాపాడాడు చివరికి
కృష్ణమాచార్య తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనేదే బాలన్స్ కథ.

===========================

పిల్ల జమీందార్
నటీనటులు : నాని, హరిప్రియ, బిందు మాధవి
ఇతర నటీనటులు : శ్రీనివాస్ అవసరాల, M.S.నారాయణ, రావు రమేష్, శివ ప్రసాద్, తాగుబోతు రమేష్,
ధనరాజ్, వెన్నెల కిశోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : సెల్వ గణేష్
డైరెక్టర్ : G. అశోక్
ప్రొడ్యూసర్ : D.S. రావు
రిలీజ్ డేట్ : 29 సెప్టెంబర్ 2011

న్యాచురల్ స్టార్ నాని తన కరియర్ లో చాలా ఇష్టపడి చేసిన సినిమా పిల్ల జమీందార్. పుట్టుకతో కోటీశ్వరుడైన యువకుడు జీవితం విలువ ఎలా తెలుసుకున్నాడు..? అనే సున్నితమైన కథాంశంతో, పర్ ఫెక్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది పిల్ల జమీందార్. అష్టా చెమ్మా తరవాత నాని, అవసరాల కలిసి చేసిన సినిమా ఇదే.

========================

పూజ
నటీనటులు : విశాల్, శృతి హాసన్
ఇతర నటీనటులు : సత్య రాజ్, రాధికా శరత్ కుమార్, ముకేశ్ తివారి, సూరి, జయ ప్రకాష్, తదిరులు
మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా
డైరెక్టర్ : హరి
ప్రొడ్యూసర్ : విశాల్
రిలీజ్ డేట్ : 22 అక్టోబర్ 2014

విశాల్, శృతి హాసన్ జంటగా మాస్ సినిమా దర్శకుడు తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘పూజ’. ప్రతీ సినిమాలో మాస్ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేసే విశాల్ అలాంటి మాస్ క్యారెక్టర్ లో నటించిన ఈ సినిమా లో యాక్షన్ సీన్స్, శృతి హాసన్ గ్లామర్, కామెడీ సీన్స్ , సాంగ్స్ హైలైట్స్ .

========================

ఒంగోలు గిత్త
నటీనటులు : రామ్ పోతినేని, కృతి కర్బందా
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కిషోర్ దాస్, ప్రభు, అజయ్, అభిమన్యు సింగ్, ఆహుతి ప్రసాద్, రమాప్రభ, రఘుబాబు, సంజయ్ రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్
డైరెక్టర్ : భాస్కర్
ప్రొడ్యూసర్ : B.V.S.N. ప్రసాద్
రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 2013

రామ్ కరియర్ లోనే అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంగోలుగిత్త. పసితనంలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి, ఆ కుట్ర వెనక దాగిన పెద్ద మనిషి అసలు రంగును బయటపెట్టడానికి వచ్చిన యువకుడిలా రామ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కృతి కర్బందా హీరోయిన్ గా నటించింది.

===========================

శివాజీ
నటీనటులు : రజినీకాంత్, శ్రియ శరన్
ఇతర నటీనటులు : వివేక్, సుమన్, రఘువరన్, మణివన్నన్, వడివుక్కరసి, కోచిన్ హనీఫా తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్
డైరెక్టర్ : S.శంకర్
ప్రొడ్యూసర్ : M.S. గుహన్, M. శరవణన్
రిలీజ్ డేట్ : 15 జూన్ 2007

ఫారిన్ నుండి దేశం కోసం ఏదైనా చేయాలనే ఆరాటం తో ఇండియాకి వస్తాడు శివాజీ. ప్రజల కోసం ఉచిత విద్య, వైద్యం అందించాలనే ఉద్దేశం తో ట్రస్ట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ శివాజే ఇలా చేయడం వల్ల తన వ్యాపారాలు దెబ్బ తింటాయని భావించిన కొందరు శివాజీని అడ్డుకుంటారు. అప్పుడు శివాజీ వారిని ఎలా ఎదుర్కుంటాడు…? తాను అనుకున్న విధంగా సమాజానికి సేవ చేయగలిగాడా..? లేదా..? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం

=========================

ఆజాద్
నటీనటులు: నాగార్జున, సౌందర్య, శిల్పాషెట్టి, రఘువరన్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం తదితరులు
సంగీతం: మణిశర్మ
నిర్మాణం: వైజయంతీ మూవీస్
నిర్మాత: అశ్వనీదత్
దర్శకుడు: తిరుపతి స్వామి
రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 29, 2000

తిరుపతి స్వామి దర్శకత్వంలో నాగార్జున చేసిన సినిమా ఆజాద్. దేశభక్తి కాన్సెప్ట్ కు ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ యాడ్ చేసి తెరకెక్కించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి. ఇక సౌందర్య నటన, శిల్పాషెట్టి అందాలు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్. ఈ సినిమాకు తిరుపతి స్వామితో పాటు యండమూరి వీరేంద్రనాథ్, భూపతిరాజా, క్రేజీ మోహన్ లాంటి ప్రముఖులు స్క్రీన్ ప్లే అందించారు.