సక్సెస్ ఫుల్ జర్నీలో మరో ముందడుగు

Tuesday,September 04,2018 - 09:07 by Z_CLU

బుడి బుడి అడుగులతో ప్రారంభమైన జీ సినిమాలు.. విజయవంతంగా రెండేళ్లు పూర్తిచేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా గ్రాండ్ గా ప్రారంభమైన జీ సినిమాలు ఛానెల్.. ఈ రెండేళ్లలో తెలుగు ప్రేక్షకులకు అన్-లిమిటెడ్ వినోదాన్ని అందించింది. ప్రేక్షకులు ఇచ్చిన ఉత్సాహంతో.. రాబోయే రోజుల్లో, మరిన్ని సూపర్ హిట్ సినిమాలు, ఎక్స్ క్లూజివ్ ఈవెంట్స్ తో మరింత ఎంటర్ టైన్ మెంట్ ను అందించడానికి సిద్ధంగా ఉంది మీ జీ సినిమాలు.

ఈ రెండేళ్ల ప్రయాణంలో జీ సినిమాలు సాధించిన విజయాలు ఎన్నో. దిల్ పై సూపర్ హిట్ అంటూ ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న జీ సినిమాలు.. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్, శాటర్ డే మెగా మూవీ, ఫ్రైడే బ్లాక్ బస్టర్స్, 9 డేస్ 9 బ్లాక్ బస్టర్స్ లాంటి ఎన్నో వినూత్నమైన ఆలోచనలతో స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది.

 

ప్రారంభమైన రెండేళ్లకే అర్బన్ సెగ్మెంట్ లో సంచలనం సృష్టించింది జీ సినిమాలు. అర్బన్ లో 122 GRP, 22 శాతం షేర్ తో… ఈ దశాబ్దంలోనే బిగ్గెస్ట్ లాంఛ్ గా నిలిచింది జీ సినిమాలు. ఈ రెండేళ్లలో జీ సినిమాలు GRP 90 నుంచి 195కు  (32వ వారం రేటింగ్స్ ప్రకారం) పెరిగింది. 12 వారాల సగటులో (23వ వారం నుంచి 34వ వారం) 185 GRPతో అర్బన్ లో నంబర్ వన్ ఛానెల్ గా అవతరించిన జీ సినిమాలు… అటు హైదరాబాద్ లో అదే 12 వారాల్లో 223 GRPతో నంబర్ వన్ గా నిలిచి సత్తాచాటింది.

టీవీ ప్రేక్షకులకు అపరిమిత వినోదాన్ని అందిస్తూనే, డిజిటల్ వేదికగా కూడా తన సత్తా చాటుతోంది జీ సినిమాలు. ఛానల్ లాంఛ్ తో పాటు ఒకేసారి వెబ్ సైట్ ను కూడా ప్రారంభించి, www.zeecinemalu.com సైట్ ద్వారా ఎప్పటికప్పుడు టాలీవుడ్ కు చెందిన లేటెస్ట్ అప్ డేట్స్, ఫొటోస్, బాక్సాఫీస్ కలెక్షన్స్, మూవీ రివ్యూస్ ను అందిస్తోంది.

రాబోయే రోజుల్లో ఇటు బుల్లితెర వీక్షకులకు, అటు డిజిటల్ ఆడియన్స్ కు మరింత వినోదాన్ని అందించే లక్ష్యంతో, సరికొత్త స్టఫ్ తో నిత్యనూతనంగా మిమ్మల్ని అలరించడానికి సిద్ధమైంది మీ జీ సినిమాలు.