2 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన పందెంకోడి 2 టీజర్

Tuesday,September 04,2018 - 10:05 by Z_CLU

అక్టోబర్ 18 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది విశాల్ పందెం కోడి 2. ‘పందెంకోడి’కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దానికి తోడు రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్, సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ స్పేస్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే 2 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ఈ టీజర్, సినిమాపై మరిన్ని అంచనాలను క్రియేట్ చేస్తుంది.

విశాల్ కి ఇది 25 వ సినిమా కావడంతో ఫిలిమ్ మేకర్స్ కూడా ఈ సినిమాని భారీ కాన్వాస్ పై ప్రెజెంట్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు. యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు హార్ట్ టచింగ్ ఫ్యామిలీ ఇమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సోషల్ మీడియాలో క్రియేట్ అవుతున్న బజ్ చూస్తుంటే, విశాల్ అకౌంట్ లో మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. లైకా ప్రొడక్షన్స్, విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ, పెన్ స్టూడియోస్, లైట్ హౌజ్ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజ్ చేశాడు.