రెండు సినిమాలతో కీరవాణి గారబ్బాయి !

Sunday,October 20,2019 - 03:49 by Z_CLU

టాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి  పెద్ద కొడుకు ‘కాల భైరవ’ మొన్నటి వరకూ సింగర్ గా పాటలు పాడిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా ‘అరవింద సమేత’ లో ‘పినివిటి’ సాంగ్ తో పాపులర్ అయిన కాల భైరవ ఇప్పుడు తన  తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని సింగర్ నుండి మ్యూజిక్ డైరెక్టర్ గా టర్న్ తీసుకుంటున్నాడు.

ప్రస్తుతం రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మిస్తున్న ‘ఆకాశవాణి’ సినిమాతో పాటు తన తమ్ముడు సింహ హీరోగా పరిచయమవుతున్న ‘మత్తు వదలరా’ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ స్టేజిలో ఉన్న ఈ రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ఈ రెండిటిలో ఏది ముందు రిలీజయితే అదే కీరవాణి తనయుడి మొదటి సినిమా అవుతుంది. మరి తండ్రిలాగే కాల భైరవ కూడా వినసొంపైన సంగీతంతో ఆకట్టుకుంటాడా చూడాలి.