జీ సినిమాలు ( 15th ఆగష్టు )

Wednesday,August 14,2019 - 10:02 by Z_CLU

ఆచారి అమెరికా యాత్ర

నటీనటులు : మంచు విష్ణుప్రగ్యా జైస్వాల్
ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావుబ్రహ్మానందంప్రదీప్ రావత్రాజా రవీంద్రఠాకూర్ అనూప్ సింగ్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.S. థమన్
డైరెక్టర్ : G. నాగేశ్వర రెడ్డి
ప్రొడ్యూసర్స్ : కీర్తి చౌదరికిట్టు
రిలీజ్ డేట్ : 27 ఏప్రిల్ 2018
కృష్ణమా చారి( విష్ణు)అప్పలా చారి (బ్రహ్మానందం) గురు శిష్యులు… తమ టీంతో కలిసి పూజలు చేస్తుంటారు.అయితే ఓసారి చక్రపాణి(కోట శ్రీనివాసరావు)అనే పెద్ద మనిషి ఇంట్లో హోమం చేయించడానికి వెళ్ళినప్పుడు అమెరికా నుంచి వచ్చిన ఆయన మనవరాలు రేణుక(ప్రగ్యా జైస్వాల్)తో ప్రేమలో పడతాడు కృష్ణమాచార్య. అదే సమయంలో రేణుక మీద హత్య ప్రయత్నం జరుగుతుంది. హోమం చివరి రోజు అనుకోకుండా చక్రపాణి చనిపోతాడు. రేణుక కూడా కనుమరుగై పోతుంది. అయితే రేణుక అమెరికా వెళ్లిందని తెలుసుకుని అప్పలాచారికి ఉద్యోగ ఆశ చూపించి ఎట్టకేలకు తన టీంతో కలిసి అమెరికా వెళతాడు కృష్ణమాచార్య. అలా రేణుక ను కలుసుకోవడానికి అమెరికాకు వెళ్ళిన కృష్ణమాచారి రేణుకకు విక్కీతో పెళ్లి జరగబోతుందని తెలుసుకుంటాడు. ఇక విక్కీ నుండి రేణుకను ఎలా కాపాడాడు చివరికి కృష్ణమాచార్య తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనేదే బాలన్స్ కథ.

==============================================================================

బ్రాండ్ బాబు

నటీనటులు : సుమంత్ శైలేంద్రఈషా రెబ్బ

ఇతర నటీనటులు : పూజిత పున్నాడమురళీ శర్మరాజా రవీంద్రసత్యం రాజేష్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : J.B.

డైరెక్టర్ ప్రభాకర్ P.

ప్రొడ్యూసర్ : A. శైలేంద్ర బాబు

రిలీజ్ డేట్ ఆగష్టు 3, 2018

వ్యాపారవేత్త డైమండ్ రత్నం (మురళీ శర్మ)కు బ్రాండ్స్ అంటే పిచ్చి. డబ్బున్నవాళ్ల స్టేటస్ మొత్తం వాళ్లు వాడే బ్రాండ్స్ లోనే కనిపిస్తుందనేది అతడి ప్రగాఢ విశ్వాసం. అతడి నమ్మకాలకు తగ్గట్టే కొడుకును పెంచుతాడు రత్నం. వాడే స్పూన్ నుంచి వేసుకునే అండర్ వేర్ వరకు ఇలా ప్రతిది బ్రాండ్ వాడే హీరో (సుమంత్ శైలేంద్ర) డైమండ్.. తనకు కాబోయే భార్య కూడా ఆల్-బ్రాండ్ అమ్మాయిగా ఉండాలని భావిస్తాడు.

అయితే ఒకసారి తనకొచ్చిన ఓ  మెసేజ్ చూసి హోం మినిస్టర్ కూతురు తనను ప్రేమిస్తుందని భ్రమపడతాడు. తనను ఇంప్రెస్ చేసేందుకు తన ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతుంటాడు. ఈ క్రమంలో హోం మినిస్టర్ కూతురు అనుకొనిఆ ఇంట్లో పనిచేస్తున్న రాధ (ఇషా రెబ్బా)ను ప్రేమిస్తాడు. అక్కడే అసలు కథ బిగిన్ అవుతుంది. బ్రాండ్ నే నమ్ముకున్న డిమాండ్పని మనిషితో ప్రేమలో పడితే ఏం జరుగుతుంది అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

దేవదాస్

నటీనటులు : నాగార్జున అక్కినేనినానిరష్మిక మండన్న, ఆకాంక్ష సింగ్ 

ఇతర నటీనటులు : R. శరత్ కుమార్కునాల్ కపూర్నవీన్ చంద్ర, నరేష్సత్య కృష్ణన్, మురళీ శర్మ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : శ్రీరామ్ ఆదిత్య

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2018

దాస్ ఓ డాక్టర్. కార్పొరేట్ హాస్పిటల్ లో పనిచేయలేక ఓ చిన్న క్లినిక్ నడిపిస్తుంటాడు. దేవ ఓ మాఫియా డాన్. ఓ గొడవ కారణంగా హైదరాబాద్ వచ్చిన దేవకు ఎన్ కౌంటర్ లో బుల్లెట్ గాయం అవుతుంది. పోలీసుల నుంచి తప్పించుకొని దాస్ క్లినిక్ కు చేరుకుంటాడు. గాయంతో వచ్చిన దేవాను దాస్ ఆదుకుంటాడు. దాస్ మంచి మనసుకు దేవ కూడా ఫిదా అవుతాడు. అలా ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోతారు.

మరోవైపు పోలీసులు దేవా కోసం వెదికే క్రమంలో దాస్ పై ఓ కన్నేసి ఉంచుతారు. ఈ క్రమంలో వలపన్ని దేవాను అరెస్ట్ చేసే సమయానికిదాస్ సమక్షంలోనే ఓ క్రిమినల్ ను దేవా చంపేస్తాడు. ఆ చావు చూసి చలించిపోయిన దాస్దేవాతో ఫ్రెండ్ షిప్ కట్ చేసుకుంటాడు. అదే సమయంలో దాస్ చెప్పిన మాటలు దేవాను మార్చేస్తాయి. ఫైనల్ గా దాస్దేవ కలిశారా లేదా..విలన్లుపోలీసులు ఏమయ్యారుమధ్యలో రష్మికఆకాంక్షల స్టోరీ ఏంటిఇది తెలియాలంటే దేవదాస్ చూడాల్సిందే.

=============================================================================

అ..ఆ

నటీనటులు : నితిన్సమంతా అక్కినేని , అనుపమ పరమేశ్వరన్

ఇతర నటీనటులు : నరేష్నదియాహరితేజఅనన్యరావు రమేష్శ్రీనివాస్ అవసరాల మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ.జె.మేయర్

డైరెక్టర్ : త్రివిక్రమ్

ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ

రిలీజ్ డేట్ : 2 జూన్ 2016

నితిన్సమంతా జంటగా నటించిన బ్యూటిఫుల్ లవ్ ఎంటర్ టైనర్ అ..ఆ. రిచ్ ఫ్యామిలీలో పుట్టిన అనసూయ (సమంతా)తల్లి క్రమశిక్షణతో విసుగెత్తి పోతుంది. దానికి తోడు తన ఇష్టా ఇష్టాలతో సంబంధం కుదర్చడం మరో తలపోటులా ఫీలవుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తండ్రి సలహా మేరకు తన మేనత్త ఇంటికి  వెళ్తుంది. ఆనంద్  విహారి ( నితిన్) తో పాటుతక్కిన ఫ్యామిలీని కలుసుకుంటుంది. ఆస్తిఆర్భాటాలు లేకపోయినా అనురాగ ఆప్యాయతలతో  ఉండే ఆ ఫ్యామిలీని ఇష్టపడటమే కాదు ఆనంద్ విహారితో ప్రేమలో కూడా పడుతుంది అనసూయ.  ఆ తరవాత ఏం జరుగుతుంది..అనేదే ఈ సినిమాలో ప్రధాన కథాంశం.

=============================================================================

యూరి

నటీనటులు : విక్కీ కౌశల్, పరేష్ రావల్, యామి గౌతమ్

ఇతర నటీనటులు :  రజిత్ కపూర్, ఇవాన్ రోడ్రిగ్స్, యోగేష్ సోమన్, మానసి పారేఖ్ గోహిల్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శాశ్వత్ సచ్ దేవ్

డైరెక్టర్ : ఆదిత్య ధార్

ప్రొడ్యూసర్ : రోని స్క్రూవాలా

రిలీజ్ డేట్ : 11 జనవరి 2019

యూరి ది సర్జికల్‌ స్ట్రైక్‌ సినిమాతో ఆదిత్య ధర్‌ అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. మేజర్‌ విహాన్‌ సింగ్‌ షెర్గిల్‌ ఇండియన్‌ ఆర్మీలో పనిచేస్తుంటాడు. విహాన్‌ పాత్రలో విక్కీ కౌశల్‌ నటించాడు. విహాన్‌ సింగ్‌ షెర్గిల్‌ సర్జికల్‌ స్ట్రైక్స్ చేయడంలో నిపుణుడు. అయితే.. విక్కీ తల్లికి అల్జీమర్స్‌ వ్యాధి వస్తుంది. దీంతో.. ఆమెను చూసుకునేందుకు తనను బోర్డర్‌ నుంచి రాజధాని ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్‌ చేయమని అడుగుతాడు. దీనివల్ల తన తల్లిని జాగ్రత్తగా చూసుకోవచ్చేనేది విక్కీ ఆలోచన. అయితే.. ఇదే సమయంలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్‌ స్ట్రైక్‌ చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. జాతీయ భద్రతా సలహాదారు పర్యవేక్షణలో ఈ స్ట్రైక్స్‌ జరుగుతాయి. దీంతో.. ఆర్మీ పిలుపు మేరకు మళ్లీ బోర్డర్‌కు వచ్చి తనకు అప్పగించిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ లీడ్‌ చేసి దిగ్విజయంగా పూర్తి చేస్తాడు విక్కీ. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్‌ పాత్రలో పరేష్‌ రావల్‌ నటించాడు.

===========================================================================

బాడీగార్డ్
నటీనటులు : వెంకటేష్త్రిషసలోని అశ్వని,
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్కోట శ్రీనివాస రావుజయ ప్రకాష్ రెడ్డిసుబ్బరాజుతనికెళ్ళ భరణి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్
డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని
ప్రొడ్యూసర్ : బెల్లం కొండ సురేష్
రిలీజ్ డేట్
 : 14 జనవరి 2012
వెంకటేష్త్రిష జంటగా నటించిన మోస్ట్ హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ బాడీగార్డ్. గోపీచంద్ మాలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ పర్ఫామెన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచింది.