ఇండిపెండెన్స్ డే స్పెషల్.. యూరి-ది సర్జికల్ స్ట్రయిక్

Wednesday,August 14,2019 - 05:23 by Z_CLU

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జీ తెలుగు ప్రేక్షకుల కోసం అద్భుతమైన సూపర్‌హిట్‌ సినిమా రెడీ అయింది. దాని పేరు యూరి-ది సర్జికల్‌ స్ట్రయిక్. 2016లో భారత ప్రభుత్వం.. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ లో చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో విక్కీ కౌశల్‌, యామీ గౌతమ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రతీ భారతీయుడిలో దేశభక్తి నింపిన యూరి సినిమాను.. ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా.. జీ తెలుగు ప్రసారం చేస్తోంది. ఆగస్ట్‌ 15 మధ్యాహ్నం 3 గంటలకు యూరి-ది సర్జికల్‌ స్ట్రైక్స్‌ సినిమా జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ చానెల్స్‌లో ప్రసారం అవుతుంది.

యూరి – ది సర్జికల్‌ స్ట్రైక్‌ సినిమాతో ఆదిత్య ధర్‌ అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. మేజర్‌ విహాన్‌ సింగ్‌ షెర్గిల్‌ ఇండియన్‌ ఆర్మీలో పనిచేస్తుంటాడు. విహాన్‌ పాత్రలో విక్కీ కౌశల్‌ నటించాడు. విహాన్‌ సింగ్‌ షెర్గిల్‌ సర్జికల్‌ స్ట్రైక్స్ చేయడంలో నిపుణుడు. అయితే.. విక్కీ తల్లికి అల్జీమర్స్‌ వ్యాధి వస్తుంది. దీంతో.. ఆమెను చూసుకునేందుకు తనను బోర్డర్‌ నుంచి రాజధాని ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్‌ చేయమని అడుగుతాడు. దీనివల్ల తన తల్లిని జాగ్రత్తగా చూసుకోవచ్చేనేది విక్కీ ఆలోచన. అయితే.. ఇదే సమయంలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్‌ స్ట్రైక్‌ చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. జాతీయ భద్రతా సలహాదారు పర్యవేక్షణలో ఈ స్ట్రైక్స్‌ జరుగుతాయి. దీంతో.. ఆర్మీ పిలుపు మేరకు మళ్లీ బోర్డర్‌కు వచ్చి తనకు అప్పగించిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ లీడ్‌ చేసి దిగ్విజయంగా పూర్తి చేస్తాడు విక్కీ. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్‌ పాత్రలో పరేష్‌ రావల్‌ నటించాడు.

రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ సినిమాకు శాశ్వత్‌ సచ్‌దేవ్‌ సంగీతం అందించాడు. ఈ సినిమాకు ప్రాణం శాశ్వత్‌ అందించిన సంగీతమే. ప్రతీ సన్నివేశం అద్భుతంగా ఉండటానికి సంగీతం దోహదపడింది.

యూరి – ది సర్జికల్‌ స్ట్రైక్‌ సినిమా ఈ ఆగస్ట్‌ 15న మధ్యాహ్నం 3 గంటల నుంచి మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ చానెల్స్‌లో. డోంట్‌ మిస్‌ ఇట్‌.