100 కోట్ల క్లబ్ లో ఖైదీ

Tuesday,January 17,2017 - 11:36 by Z_CLU

9 ఏళ్ల గ్యాప్ కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపలేకపోయింది. ఇంత గ్యాప్ తరవాత మెగాస్టార్ మళ్ళీ అదే రేంజ్ లో ఎట్రాక్ట్ చేయగలడా అని చిన్న సైజు అనుమానం ఉన్నవారికి కూడా పెద్ద సైజు బ్లాక్ బస్టర్ తో బదులుచ్చింది ఖైదీ. జనవరి 11 న రిలీజయిన మెగాస్టార్ ఖైదీ నం 150, 100 కోట్ల క్లబ్ లో చేరడానికి పెద్దగా టైం పట్టలేదు.

వరల్డ్ వైడ్ గా రిలీజైన ఖైదీ ఇప్పటికే 106 కోట్లు వసూలు చేసింది. కేవలం నార్త్ అమెరికాలోనే $2,104, 844 వసూలు చేసిన ఖైదీ, ఈ వీకెండ్ మరిన్ని వసూళ్లతో రికార్డు క్రియేట్ చేసే పనిలో పడింది. సంక్రాంతి బరిలో ఫుల్లీ లోడెడ్ కాన్ఫిడెన్స్ తో బాస్ ఈజ్ బ్యాక్ ట్యాగ్ లైన్ దిగిన ఖైదీ, మెగా స్టామినాని జస్ట్ వన్ వీక్ లో ప్రూఫ్ చేసేసింది.