వరల్డ్ ఫేమస్ లవర్ ట్రయిలర్ రివ్యూ

Thursday,February 06,2020 - 04:12 by Z_CLU

భాష-యాస, గెటప్-సెటప్, కథ-జానర్.. ఇలా ఏదైనా మారొచ్చు. కానీ ఎమోషన్ మారదు. అది కనెక్ట్ అయితే కథ ఏదైనా సినిమా నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. అలాంటి యూనిక్ ఎమోషన్స్ తో వస్తోంది వరల్డ్ ఫేమస్ లవర్. కొద్దిసేపటి కిందట విడుదలైన ఈ సినిమా ట్రయిలర్ లో అలాంటి ఎమోషన్స్ కనిపించాయి.

ఒక హీరో, ముగ్గురు హీరోయిన్లు టైపు కథలు మనకు కొత్తకాదు. ఏఎన్నార్, శోభన్ బాబు నుంచి జగపతిబాబు వరకు చాలామంది టచ్ చేశారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా అదే టచ్ చేశాడు. కానీ అప్పటికీ ఇప్పటికీ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. హీరో తన జీవితంలో ముగ్గురు అమ్మాయిలకీ చోటిస్తాడు. ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. కానీ పొరపొచ్చాలు మాత్రం వస్తాయి. ఈ ఎలిమెంట్ ట్రయిలర్ లో స్పష్టంగా కనిపించింది.

అర్జున్ రెడ్డి ఎలాగైతే హీరో క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుందో.. ఈ సినిమాలో కూడా కథ హీరో పాత్ర చుట్టూ తిరుగుతుందనే విషయాన్ని ట్రయిలర్ తో క్లారిటీ ఇచ్చారు. హీరో కూడా లుక్స్ పరంగా అర్జున్ రెడ్డిని గుర్తుచేేశాడు.

ఇక పెర్ఫార్మెన్స్ ల విషయానికొస్తే.. ఎప్పట్లానే విజయ్ దేవరకొండ మరోసారి మెస్మరైజ్ చేశాడు. హీరోయిన్లు రాశిఖన్నా, ఐశ్వర్య రాజేశ్, క్యాథరీన్ పాత్రల్ని ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా నీట్ గా డిజైన్ చేశారు.

గోపీసుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, జయకృష్ణ గుమ్మడి కెమెరావర్క్ బాగున్నాయి. క్రాంతి మాధవ్ డైరక్ట్ చేసిన ఈ సినిమా, వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి వస్తోంది.