అప్పుడు ప్రభాస్.. ఇప్పుడు ఎన్టీఆర్

Thursday,February 06,2020 - 02:18 by Z_CLU

‘బాహుబలి’ ప్రాంచైజీ కోసం తన డైరీలో నుంచి ఐదేళ్ళు కేటాయించాడు ప్రభాస్. హీరోగా పీక్ టైంలో ఉండగా ఒక కథను నమ్మి ఐదేళ్ళు డేట్స్ ఇవ్వడం అంటే మాటలు కాదు. ఆ సమయంలో రెండు సినిమాలకు బదులు మరో మూడు సినిమాలు చేసుకోవచ్చు. కానీ ప్రభాస్ ఇవేవి ఆలోచించకుండా ‘బాహుబలి’ని గట్టిగా నమ్మాడు. కట్ చేస్తే ఐదేళ్ళ తన కష్టానికి ప్రతిఫలంగా నేషనల్ స్టార్ గా ఎదిగాడు. ఈ విషయంలో ఇప్పటికీ ప్రభాస్ ను పోగిడేస్తుంటారు ఇండస్ట్రీ వ్యక్తులు.

అయితే రాజమౌళి సినిమా కోసం ప్రభాస్ ఐదేళ్ళు కేటాయిస్తే ఇప్పుడు తారక్ ‘RRR’ కోసం జక్కన్నను నమ్మి రెండేళ్ళ పాటు స్క్రీన్ కు దూరమవుతున్నాడు. అవును తారక్ నుండి సినిమా వచ్చి ఏడాది దాటేసింది. ఇక ఈ ఏడాదిలో రావాల్సిన ‘RRR’ వచ్చే ఏడాది జనవరికి పోస్ట్ పోన్ అవ్వడంతో ఇక ఈ ఏడాది కూడా తారక్ నుండి సినిమా ఉండదనేది ఫిక్స్.

అంటే వచ్చే ఏడాదికి తారక్ స్క్రీన్ మీద కనిపించి సరిగ్గా రెండేళ్ళవుతుంది. కానీ గ్యాప్ ను ఫ్యాన్స్ మర్చిపోయేలా చేయడం రాజమౌళి కి కొట్టిన పిండి కదా. సో ప్రభాస్ ‘బాహుబలి’ ప్రాంచైజీ కోసం ఫ్యాన్స్ కు ఐదేళ్ళు దూరమైతే ఇప్పుడు ‘RRR’ సినిమా కోసం తారక్ రెండేళ్ళ పాటు సిల్వర్ స్క్రీన్ కు దూరమౌతున్నాడన్నమాట.