వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,February 17,2020 - 11:10 by Z_CLU

విజయ్ దేవరకొండ స్టోరీ సెలక్షన్ తప్పని మరోసారి రుజువైంది. అతడు నటించిన లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ బాక్సాఫీస్ బరిలో డిసప్పాయింట్ చేసింది. మొదటి రోజు డీసెంట్ గా ఓపెన్ అయిన ఈ మూవీ, ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

మొదటి రోజు వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు 4 కోట్లకు పైగా షేర్ వచ్చింది. రెండో రోజు మాత్రం ఈ సినిమాకు దాదాపు 30శాతం ఆక్యుపెన్సీ పడిపోయింది. వీకెండ్ అయినప్పటికీ ఈ సినిమా కోలుకోలేకపోయింది. అలా తొలి 3 రోజుల్లో ఈ సినిమాకు వరల్డ్ వైడ్ అటుఇటుగా 10 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది.

వరల్డ్ వైడ్ ఈ సినిమాను 30 కోట్ల రూపాయలకు అమ్మారు. ఏపీ,నైజాంలోనే ఈ సినిమా దాదాపు 22 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. తాజా వసూళ్లు చూస్తుంటే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కొంచెం కష్టమే. వర్కింగ్ డేస్ కావడంతో ఇవాళ్టి నుంచి వరల్డ్ ఫేమస్ లవర్ కు ఆటోమేటిగ్గా కలెక్షన్స్ తగ్గుతాయి.

అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా పరిస్థితి ఏమంత పాజిటివ్ గా లేదు. 3 రోజుల్లో ఈ సినిమాకు కేవలం 2 లక్షల 30వేల డాలర్లు మాత్రమే వచ్చాయి. ఇంకా చెప్పాలంటే విజయ్ దేవరకొండ నటించిన నోటా కంటే.. వరల్డ్ ఫేమస్ లవర్ కు ఫస్ట్ వీకెండ్ వసూళ్లు తక్కువగా వచ్చాయి.