Pooja Hegde - విమెన్స్ డే శుభాకాంక్షలు చెప్పిన బుట్టబొమ్మ

Tuesday,March 08,2022 - 01:46 by Z_CLU

Women’s day wishes from Pooja Hegde

మహిళా ప్రాధాన్యతను తెలియజేస్తూ ప్రతి ఏడాది మార్చి 8న ఇంటర్నేషనల్ విమెన్స్ డేను సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్దే మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

పూజా మాట్లాడుతూ.. ‘మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రపంచంలో మహిళల పాత్ర చాలా కీలకమైనది. తల్లిగా, చెల్లిగా, భార్యగా ఎన్నో పాత్రలు పోషిస్తోంది. నా జీవితంలో నేను చూశాను. మా అమ్మ.. తన భర్తను, పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటోంది. ఇదంతా ఒక బాధ్యతగా భావిస్తున్నాను. ఇంత గొప్ప పాత్ర పోషిస్తున్న మహిళలకు నా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ కూడా తమ చుట్టూ ఉన్న మహిళలను గౌరవించాలని కోరుతున్నాను.’ అని పేర్కొంది.

పూజా హెగ్దే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘రాధే శ్యామ్’ మూవీలో నటించింది. ఈ చిత్రానికి రాధాక్రష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెరక్కెక్కించిన ఈ పీరియాడిక్ లవ్ స్టోరీ, ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics