Radheshyam ఎందుకు చూడాలి ? టాప్ 10 రీజన్స్ ఇవే !

Tuesday,March 08,2022 - 04:36 by Z_CLU

Top 10 Reasons to watch Prabhas’s ‘Radheshyam’

పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ , క్యూట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన ‘రాధేశ్యామ్‘ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ పీరియాడిక్ లవ్ స్టోరి మార్చ్ 11న ఐదు భాషల్లో గ్రాండ్ గా రిలీజవుతోంది.

అసలు ‘రాధేశ్యామ్‘ ఎందుకు చూడాలి ? కొన్ని రీజన్స్ తెలుసుకుందాం.

Top-10-reasons-to-watch-radheshyam-image1-prabhas

ప్రభాస్ : 

వరల్డ్ లెవెల్ లో స్టార్డం అందుకున్న ప్రభాస్ నుండి మూడేళ్ళ తర్వాత వస్తున్న సినిమా ఇది . ‘సాహో’ తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రభాస్ లవ్ స్టోరీ చేయలేదు. ఈ సినిమా కోసం మళ్ళీ లవర్ బాయ్ గా మారిపోయాడు. స్టైలిష్ హ్యాండ్సమ్ లుక్ లో ఎట్రాక్ట్ చేస్తున్నాడు. అందుకే ప్రభాస్ ని లవర్ బాయ్ గా మార్చేసిన రాధేశ్యామ్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

 Top-10-reasons-to-watch-radheshyam-reason2-prabhas-pooja

ప్రభాస్ – పూజ హెగ్డే కెమిస్ట్రీ :

ఏ లవ్ స్టోరీకయినా క్యూట్ పెయిర్ ముఖ్యం. స్క్రీన్ పై ఉన్నది హీరో -హీరోయిన్ కాదని ఆ పాత్రల్లో వాళ్ళని ప్రేక్షకులు చూస్తే కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్టే. ‘రాధేశ్యామ్’ కి ఫస్ట్ ఎడ్వాంటేజ్ అదే. ప్రభాస్ -పూజ కెమిస్ట్రీ ఓ రేంజ్ లో వర్కౌట్ అయిందని టీజర్ , ట్రైలర్స్ చూస్తే అర్థమవుతుంది. పైగా సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ అదిరిపోయాయని టాక్. ప్రమోషన్స్ లో కూడా ఈ పెయిర్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ వీళ్ళని  విక్రమ్ ఆదిత్యా , ప్రేరణలుగా స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా ? అనే ఎగ్జైట్ మెంట్ కలిగిస్తుంది.

 

స్టోరీ లైన్  :

హీరోకి పామిస్ట్ క్యారెక్టర్ క్రియేట్ చేసి లవ్ , డెస్టినీ మధ్య జరిగే ఓ యుద్ధంతో స్టోరీ లైన్ అనుకొని దాన్ని డెవలప్ చేశాడు దర్శకుడు రాధాకృష్ణ. ఒక దశలో ఈ స్టోర్ లైన్ వర్కౌట్ అవ్వదని భావించి పక్కన పెట్టేశాడు. కానీ ఇందులో మేజిక్ ఉందని గమనించి మళ్ళీ దాని మీద వర్కౌట్ చేసి దాని చుట్టూ అందమైన స్క్రీన్ ప్లే అల్లాడు. రాధా కృష్ణ కొన్నేళ్ళ పాటు వర్క్ చేసిన స్టోరీ -స్క్రీన్ ప్లే సినిమాకు హైలైట్ అవ్వనున్నాయి. ఈ సినిమా ప్రేక్షకులకి ఓ కొత్త అనుభూతి అందించడం ఖాయంమని దర్శకుడు స్ట్రాంగ్ గా చెప్తున్నాడు.

 

డైరెక్టర్ రాధాకృష్ణ :

ఒక సినిమా చూసే ముందు ఆ సినిమా దర్శకుడి మీద నమ్మకంతోనే థియేటర్స్ లోకి వెళ్తారు ఆడియన్స్. అతని ప్రీవియస్ వర్క్ కూడా ప్రేక్షకుల్లో అంచనాలు కలిగేలా చేస్తుంది.  దర్శకుడు రాధా కృష్ణ కొన్నేళ్ళ ముందు గోపీచంద్ తో ‘జిల్’ అనే సినిమా తీశాడు. ఆ టైంలో గోపీచంద్ కి ఓ కొత్త లుక్ ఇచ్చి స్టైలిష్ యాక్షన్ సినిమా చేశాడు. ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే ప్రభాస్ , యూవీ క్రియేషన్స్ అతన్ని లాక్ చేసుకొని స్క్రిప్ట్ పై వర్క్ చేయమని అడ్వాన్స్ ఇచ్చారు. రెండో సినిమాకి ఊహించనంత బడ్జెట్ పెట్టి పాన్ ఇండియా హీరోని చేతిలో పెడితే మరి రాధా కృష్ణ ఓ రేంజ్ లో మేజిక్ చేయకుండా ఉంటాడా ? కొద్ది రోజుల్లో అదే జరగనుంది. ‘రాధే శ్యామ్’ రిలీజ్ తర్వాత రాధాకృష్ణ  స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోవడం ఖాయం.

Top-10-reasons-to-watch-radheshyam-reason5-krishnamraju-zeecinemalu

కృష్ణంరాజు : 

చాన్నాళ్ళ తర్వాత రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఇందులో నటించారు. కథని ములుపు తిప్పే  పరమహంస అనే స్వామీజి  క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. ఈ క్యారెక్టర్ కోసం ఆయన మూడు నెలలు గెడ్డం పెంచారు. చాలా గ్యాప్ తర్వాత రెబెల్ స్టార్ స్క్రీన్ పై కనిపించడం కూడా ఈ సినిమా చూడ్డానికి ఓ రీజన్.

మ్యూజిక్ :

లవ్ స్టోరీతో తెరకెక్కే సినిమాలకు ఆ మేజిక్ క్రియేట్ చేసే మ్యూజిక్ చాలా అవసరం. ఈ సినిమాకు అది పర్ఫెక్ట్  గా కుదిరిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘రాధేశ్యామ్’ కోసం జస్టిన్ ప్రభాకర్ సోల్ ఫుల్ సాంగ్స్ కంపోజ్ చేశాడు. “ఈ రాతలే” సాంగ్ రిలీజ్ కి ముందే మంచి వైబ్స్ క్రియేట్ చేసింది. ఇక ప్రెజెంట్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెస్మరైజ్ చేస్తూ దూసుకెళ్తున్న తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్ అవ్వనుంది. తమన్ ఇచ్చిన స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిందని స్వయంగా ప్రభాసే చెప్పాడు.

గ్రాండియర్ విజువల్స్ :

‘రాధేశ్యామ్’ గురించి రిలీజ్ కి ముందే అందరూ మాట్లాడుకునేలా  చేస్తున్నాయి గ్రాండియర్ విజువల్స్. అవును ప్రేక్షకులకు ఓ కొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం కోసం బెస్ట్ విజువల్స్ ఉండేలా ప్లాన్ చేశారు. మనోజ్ పరమహంస కెమెరా వర్క్ సినిమాకి వన్ ఆఫ్ ది హైలైట్ అంటూ ఇప్పటికే టీం ఖితాబిచ్చారు. ప్రభాస్ ని పూజ ఎంతో అందంగా చూపించారని రిలీజైన కంటెంట్ చూస్తే తెలుస్తుంది. ఇటలీ లోకేషన్స్ కూడా ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ ఇవ్వనున్నాయి.

సెట్స్ 

ఈ సినిమా కోసం ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ రెడ్డి వేసిన భారీ సెట్స్ కూడా సినిమా కచ్చితంగా చూడాలి అని చెప్పేందుకు ఓ రీజన్. అవును హైదరాబాద్ లో ఇటలీ ని సెట్స్ తో దింపేశారు. క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం వేసిన భారీ సెట్స్ వావ్ అనిపించడం ఖాయం. ఆర్ట్ వర్క్ సంబంధించి ప్రతీ ఎలిమెంట్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయనుంది. రవీందర్ రెడ్డి ఈ సినిమాను ఓ ఛాలెంజింగ్ గా తీసుకొని బెస్ట్ ఆర్ట్ వర్క్ అందించారు. సినిమా రిలీజ్ తర్వాత ఈ కేటగిరీలో ఓ అవార్డు రావడం ఖాయమని వర్క్ చేసిన అందరూ భావిస్తున్నారు.

గ్రాఫిక్స్ :

ఈ సినిమా కోసం ది బెస్ట్ గ్రాఫిక్ టీం వర్క్ చేశారు. షూటింగ్ పూర్తయ్యాక విజువల్ ఎఫెక్ట్స్ కోసమే చాలా టైం తీసుకున్నారు. ఎక్కడా కంప్రమైజ్ అవ్వకుండా గ్రాఫిక్స్ కోసం ఖర్చు పెట్టారు మేకర్స్. హాలీవుడ్ లో చూసినట్టుగా కొన్ని గ్రాఫిక్స్ ఈ సినిమాకు బాగా కుదిరాయని అంటున్నారు. ముఖ్యంగా సినిమా ఎండింగ్ లో వచ్చే గ్రాఫిక్స్ తో కూడిన విజువల్స్ ని బిగ్ స్క్రీన్ పై ఎక్స్ పీరియన్స్ చేయాల్సిందే.

 

 ప్రొడక్షన్ వేల్యూస్

సహజంగా ఓ రాజు తాలూకు భారీ పీరియాడిక్ కథకో లేదా ఏదైనా ఓ  యుద్ధంతో వండే భారీ కథకో నిర్మాతలు భారీ బడ్జెట్ పెడతారు. కానీ యూవీ నిర్మాతలు మాత్రం ఇప్పటి వరకూ ఎవరూ చేయని ఓ సాహసం చేశారు. డెస్టినీ వర్సెస్ లవ్ అనే స్టోరీని గ్రాండియర్ గా చూపించాలని భావించి దాదాపు ౩౦౦కోట్లు ఖర్చు పెట్టారు.  ఈ బడ్జెట్ తో మేకర్ ప్రేక్షకులకు ఏ రేంజ్ సినిమా చూపించాబోతున్నారో అర్థం చేసుకోవచ్చు. థియేటర్స్ కొచ్చిన ఆడియన్ కి ఓ హాలివుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించాలని ఈ భారీ ప్రయత్నం చేశారు నిర్మాతలు. టాప్ నాట్చ్ ప్రొడక్షన్ వేల్యూస్ కోసం ఈ సినిమా తప్పకుండా థియేటర్స్ లో చూడాల్సిందే.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics