విన్నర్ మొదటి రోజు వసూళ్లు

Sunday,February 26,2017 - 03:37 by Z_CLU

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ, లక్కీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా విన్నర్. శివరాత్రి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా తొలి రోజు వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టించింది. సాయిధరమ్ తేజ కెరీర్ లోనే ఫస్ట్ డే హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా విన్నర్ నిలిచింది. అంతేకాాదు.. ఈ ఏడాది ఖైదీ నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాల తర్వాత విన్నర్ సినిమానే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది.

ఇక వసూళ్ల విషయానికొస్తే తెలుగు రాష్ట్రాల్లో సాయిధరమ్ తేజ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలుపుకొని మొదటి రోజు విన్నర్ మూవీకి ఏకంగా 5 కోట్ల 63 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఓవర్సీస్ వసూళ్లు కూడా కలుపుకుంటే… 6 కోట్ల 40లక్షల రూపాయల షేర్ వచ్చింది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మించారు.