పూరి 'రోగ్‌'కి ఇంప్రెస్‌ అయిన సల్మాన్‌ఖాన్‌ 

Sunday,February 26,2017 - 02:03 by Z_CLU

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ యంగ్‌ హీరో ఇషాన్‌ను ‘రోగ్‌’ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ ఇటీవల విడుదలై సినిమాపై అందరిలోనూ క్యూరియాసిటీ పెంచుతోంది. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ను పూరి జగన్నాథ్‌ ఇటీవల కలిసి ‘రోగ్‌’ చిత్రం గురించి డిస్కస్‌ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని విశేషాలను సల్మాన్‌తో పంచుకున్నారు పూరి.

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఆ విశేషాలను తెలియజేస్తూ – ”రీసెంట్‌గా సల్మాన్‌ఖాన్‌ను కలిసి ‘రోగ్‌’ సబ్జెక్ట్‌ను నేరేట్‌ చెయ్యడం జరిగింది. కొత్త ఫ్లేవర్‌తో చేసిన ఈ కథను విని సల్మాన్‌ ఎంతో ఇంప్రెస్‌ అయ్యారు. ఏరగెంట్‌గా వుండే ఓ కుర్రాడు పరిస్థితుల ప్రభావం వల్ల ఎలా మారాడు అనే ఒక కొత్త ఐడియాతో రూపొందించిన ‘రోగ్‌’ గురించి విని చాలా ఎక్సైట్‌ అయ్యారు. ఈ కథే కాకుండా వేరే కథలు కూడా సల్మాన్‌కి నేరేట్‌ చెయ్యడం జరిగింది. తను సూరజ్‌ పంచోలితో ఒక సినిమా నిర్మించాలని అనుకుంటున్నానని, మంచి సబ్జెక్ట్‌ కోసం చూస్తున్నానని చెప్పారు. నేను సల్మాన్‌కి చెప్పిన సబ్జెక్ట్స్‌లో ఒకటి త్వరలోనే ఫైనల్‌ అవుతుంది. సల్మాన్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. మేమిద్దరం తరచూ కలుస్తుంటాం. రకరకాల సబ్జెక్ట్స్‌ గురించి డిస్కస్‌ చేస్తూ వుంటాం. సల్మాన్‌తో నా మీటింగ్‌ ఎంతో సరదాగా వుంటుంది. కొత్త తరహా సబ్జెక్ట్స్‌, కొత్త ఐడియాలు సల్మాన్‌ లైక్‌ చేస్తారు. అందుకే సల్మాన్‌ అంటే నాకు ఎంతో ఇష్టం” అన్నారు.