బయోపిక్ లో రానా: ఆ టాప్ డైరక్టర్ ఎవరు?

Sunday,May 20,2018 - 11:24 by Z_CLU

5000 కి పైగా పోటీల్లో ఓటమనేదే ఎరుగని మహా మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు. ఆయన ప్రతిభ కి అప్పట్లో కింగ్ జార్జ్ స్వయంగా ‘ఇండియన్ హెర్క్యూలెస్’, ‘కలియుగ భీమ’ బిరుదులతో కోడి రామ్మూర్తి నాయుడుని సత్కరించారు. అంతటి మహాబలుడి జీవితాన్ని వెండితెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. రానా ఇందులో కోడి రామ్మూర్తిగా నటిస్తాడని టాక్.

ఈ భారీ, చారిత్రాత్మక యాక్షన్ డ్రామా తెలుగు, హిందీ భాషల్లో రూపొందనుంది. సౌత్ కి చెందిన ఒక అగ్ర నిర్మాణ సంస్థ తో పాటు ప్రముఖ అంతర్జాతీయ నిర్మాణ సంస్థ కలిసి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం కోసం ఒక అగ్ర దర్శకునితో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆ దర్శకుడు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్

అన్ని అనుకున్నట్టు జరిగితే అతి త్వరలోనే ఈ ప్రాజెక్టు డీటెయిల్స్ బయటకొస్తాయి. ఈ సినిమా స్టోరీని ఇప్పటికే రైటర్స్ అసోసియేషన్ లో రిజిస్టర్ చేయించారు.