రవితేజ సినిమా నుంచి తప్పుకున్న అను

Sunday,May 20,2018 - 12:10 by Z_CLU

రవితేజ, అను ఎమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా అమర్-అక్బర్-ఆంటోనీ సినిమా ఇలా స్టార్ట్ అవ్వడం, అలా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వడం అన్నీ జరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇంతలోనే సడెన్ గా ఈ సినిమా నుంచి హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్ తప్పుకుంది. దానికి ఆమె రీజన్ కూడా చెప్పింది.

“దురదృష్టవశాత్తూ అమర్ అక్బర్ ఆంటోనీ ప్రాజెక్టులో నేను భాగం కాదు. శైలజారెడ్డి అల్లుడు సినిమాతో డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల రవితేజ సినిమా నుంచి తప్పుకుంటున్నాను. అమర్ అక్బర్ ఆంటోనీ టీమ్ కు శుభాకాంక్షలు.” అను ఎమ్మాన్యుయేల్ తాజా ట్వీట్ ఇది.

అను తప్పుకోవడంతో ఇప్పుడు ఆ స్థానంలో శృతిహాసన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు, సినిమాలో మరో కీలక పాత్ర కోసం ఇలియానాను కూడా సంప్రదిస్తున్నారట. త్వరలోనే అమర్-అక్బర్-ఆంటోనీ సినిమాలో హీరోయిన్లపై ఓ క్లారిటీ రానుంది.