సుకుమార్ లిస్టు లో ఇద్దరు స్టార్ హీరోలు ...

Monday,April 09,2018 - 09:30 by Z_CLU

‘రంగస్థలం’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సుకుమార్ నెక్స్ట్ సినిమా ఏ హీరోతో చేస్తాడా.. అనే క్యూరియాసిటీ రోజురోజుకి పెరుగుతుంది. ఇప్పటికే బన్నీ, మహేష్, ఎన్టీఆర్, చరణ్ లాంటి స్టార్ హీరోలను కవర్ చేసేసిన సుక్కు ఈసారి ప్రభాస్ తో ఓ సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సుక్కు, ప్రభాస్ ని కలిసి ఓ పాయింట్ చెప్పాడని, ప్రభాస్ కి పాయింట్ బాగా నచ్చిందని సుక్కు తో పనిచేసేందుకు యంగ్ రెబల్ స్టార్ రెడీ గా ఉన్నాడని టాక్.

అయితే సుక్కు నెక్స్ట్ సినిమా లిస్ట్ లో అల్లు అర్జున్ పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది. ఇప్పటికే బన్నీతో రెండు సినిమాలు చేసిన సుకుమార్  మూడో సినిమా ప్లాన్ చేస్తున్నాడని టాక్. ప్రెజెంట్ ‘రంగస్థలం’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సుకుమార్ హాలిడే ట్రిప్ లో ఉన్నాడు. రంగస్థలం కోసం ఏడాదిన్నర పాటు కేటాయించిన సుక్కు ఇప్పుడు తన ఫ్యామిలీ కోసం ఓ రెండు నెలలు కేటాయించాడు. ఆ హాలిడే ట్రిప్ నుండి వచ్చాకే నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ వర్క్  చేస్తాడట. మరి ఈ ఇద్దరిలో సుక్కు డైరెక్ట్ చేయబోయే హీరో ఎవరో..తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.