వరుణ్ తేజ్ సినిమా కోసం భారీ సెట్

Monday,April 09,2018 - 10:01 by Z_CLU

‘ఘాజీ’ ఫేం సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో వరుణ్ తేజ్ ఓ స్పేస్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఓ భారీ సెట్ వేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ -మౌనిక ల సమక్షంలో స్పేస్ స్టేషన్ సెట్ వర్క్ జరుగుతుంది.

ఇప్పటికే ‘రంగస్థలం’ సినిమాలో తమ ఆర్ట్ వర్క్ తో మెస్మరైజ్ చేసి ప్రశంశలు అందుకున్న రామకృష్ణ మౌనిక ఈ సినిమాకు ఆర్ట్ వర్క్ చేస్తుండడంతో ఈ సెట్ ఏ రేంజ్ లో ఉంటుందా ..? అనే క్యూరియాసిటీ మొదలైంది. త్వరలోనే ఈ భారీ సెట్ లో మొదటి షెడ్యుల్ స్టార్ట్ చేయబోతున్నారు యూనిట్. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి, సాయి బాబా జాగర్లమూడి ఈ సినిమాను నిర్మించనున్నారు.