తమన్నాని రీప్లేస్ చేసేదెవ్వరు...?

Friday,July 05,2019 - 01:04 by Z_CLU

రాజుగారి గది 3’ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేసేవరకు హీరోయిన్ తమన్నానే. ఆల్మోస్ట్ సినిమా సెట్స్ పైకి వచ్చేస్తుందనుకున్న టైమ్ లో, డేట్స్ సర్దుబాటు చేసుకోలేక తప్పుకుందీ మిల్కీ బ్యూటీ. అయితే ఈ ప్లేస్ ని భర్తీ చేయబోయే హీరోయిన్ ఎవరు..? 

రాజుగారి గది 2’ లో సమంతాని ప్రిఫర్ చేసిన దర్శకుడు ఓంకార్, ఈసారి కూడా అదే రేంజ్ స్టార్ హీరోయిన్ ని ఫిక్స్ చేసుకునే ఆలోచనలో ఉన్నాడు. అందుకే సీన్ లోకి తమన్నా వచ్చింది. ఇప్పుడు అది కుదరడం లేదు కాబట్టి… ఈ వరసలో నెక్స్ట్ ఎవరుంటారు..? 

ఆల్రెడీ ఈ ఫ్రాంచైజీలో సమంతా చేసేసింది కాబట్టి ఈ వరసలో నెక్స్ట్ ఇమ్మీడియట్ గా వచ్చే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. మరి ఓంకార్ కూడా అదే యాంగిల్ లో ఆలోచిస్తాడా..? ప్రస్తుతానికయితే ఈ స్పేస్ లో తాప్సీ పేరు కూడా వినిపిస్తుంది. 

‘రాజుగారి గది 2’ లో నాగార్జున లీడ్ స్పేస్ లో ఉన్నాడు.. కానీ ఇప్పుడు కథ మొత్తం తిరిగేది హీరోయిన్ చుట్టే.. కాబట్టి సాదాసీదా హీరోయిన్ అయితే అస్సలు కుదరదు.. అందుకే కాస్త టైమ్ పట్టినా పర్వాలేదు కానీ, స్టార్ హీరోయిన్ అయితేనే బెటర్ అని ఫిక్సయి ఉంది ‘రాజుగారి గది 3’ టీమ్. చూడాలి మరీ చివరికి ఎవరిని సెట్స్ పైకి తీసుకు వస్తారో…