తాప్సీతో కలిసొచ్చేదక్కడే...

Friday,July 05,2019 - 12:03 by Z_CLU

ఓ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా అనగానే నిర్మాతల ఫస్ట్ చాయిస్ తాప్సీ అవుతుంది. దానికి ఓ రీజన్ ఉంది. తాప్సీ తో సినిమా చేస్తే ఈజీగా సినిమాని 3 లాంగ్వేజెస్ లో సక్సెస్ ఫుల్ గా రిలీజ్ చేసేయొచ్చు. అలా  ప్రొడ్యూసర్స్  కి  కలిసొస్తుంది తాప్సీ. 

రీసెంట్ గా రిలీజైన సినిమా ‘గేమ్ ఓవర్ ‘ సక్సెస్ అవ్వడంతో మరింత ఫామ్ లోకి వచ్చింది తాప్సీ. మరో వైపు రీసెంట్ గా క్రికెటర్ ‘మిథాలి రాజ్’ బయోపిక్ కి కూడా సంతకం చేసింది. న్యాచురల్ గానే ఫిట్ నెస్ విషయంలో చాలా కేరింగ్ గా ఉండే తాప్సీ, ప్రస్తుతం క్రికెటర్ గా కొన్ని కీ సన్నివేశాల కోసం ప్రాక్టీస్ చేస్తుంది.

ఓ వైపు గ్లామరస్ హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే,  మరోవైపు కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలతో ప్రొడ్యూసర్స్ కి మోస్ట్ ఫ్రెండ్లీ యాక్ట్రెస్ అనిపించుకుంటుంది. ఓ బైలింగ్వల్ సినిమా అనుకుంటే చాలు హీరోయిన్ తాప్సీ అయితే బెటర్ అనే రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది.  

అటు హిందీలో బిజీ బిజీగా ఉన్నా, ఇటు సౌత్ సినిమాల్లో ఏ మాత్రం ఆడియెన్స్ తో డిస్కనెక్ట్ అవ్వకుండా, ఈక్వల్ రేషియో మెయిన్ టైన్ చేస్తూ… తాప్సీ అంటే తెలిసిన హీరోయినే అనే స్థాయిలో అందుబాటులో ఉంటుంది. అదే తన కరియర్ కి బిగ్గెస్ట్ అవుతుంది.