Nabha Natesh - లాక్ డౌన్ లో ఏం చేసింది?
Monday,September 13,2021 - 11:55 by Z_CLU
వరుసగా రెండు లాక్ డౌన్స్ పడ్డాయి. హీరోయిన్లంతా ఇళ్లకే పరిమితమైపోయారు. ఎవరికి తోచిన పనులు వాళ్లు చేసుకున్నారు. మరి ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ఏం చేసింది?
– లాక్డౌన్ సమయంలో సినిమాలు చూడటమే నా పని. ఫస్ట్ వేవ్‌లో చాలా కంటెంట్ వచ్చింది. అన్ని భాషల చిత్రాలు చూశాను. కానీ ఈసారి మాత్రం అంతగా కుదరలేదు. సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నాను. పైగా కంటెంట్ కూడా అంతగా రాలేదు.
– లాక్డౌన్ తరువాత ఇండియాలోనే మొదటిసారి షూటింగ్ చేసింది మేమే. సోలో బతుకే సో బెటర్ సినిమాను కూడా రిలీజ్ చేశాం. అప్పుడు భయభయంగానే చేశాం. వీలైనంత తక్కువ మందితో, అన్ని జాగ్రత్తలు తీసుకుని చేశాం. షూటింగ్ అయిపోగానే పరిగెత్తుకుంటూ దూరంగా వెళ్లిపోయేవాళ్లం. కానీ ఇప్పుడు అంత భయం లేదు. అలవాటు అయింది
– కరోనా సమయంలో నావి రెండు సినిమాలు విడుదలయ్యాయి. మాస్ట్రో మూడో సినిమా. ఇది వరకే నాకు ఓటీటీ భయం ఉండేది. ఏ సినిమా ఓటీటీలో వస్తుంది అని అనుకున్నాను. ఇంకా థియేటర్ల సమస్య ఉంది. కానీ ఇప్పుడు ఓటీటీలో అయితే అందరూ చూసేందుకు అవకాశం ఉంది.
– భవిష్యత్తు ప్రాజెక్ట్‌ల గురించి అఫీషియల్ గా ఎనౌన్స్ చేసేంత వరకు ఇప్పుడే ఏమీ చెప్పలేను. అన్ని రకాల పాత్రలను చేయాలని ఉంది. అన్ని రకాల జానర్లలో సినిమాలు చేస్తున్నాను. అది నాకు చాలా ఆనందంగా ఉంది. కొత్త కొత్త పాత్రలు చేయాలని అనుకుంటున్నాను.
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics