ZeeCinemalu - Sep 13

Sunday,September 12,2021 - 08:28 by Z_CLU

adirindayya-chandram-zeecinemalu
అదిరిందయ్యా చంద్రం
నటీనటులు – శివాజీ, లయ
ఇతర నటీనటులు – సంగీత, మధుశర్మ, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, ఏవీఎస్
మ్యూజిక్ డైరెక్టర్ – ఎం.ఎం.శ్రీలేఖ
డైరెక్టర్ – శ్రీనివాసరెడ్డి
రిలీజ్ డేట్ – 2005, ఆగస్ట్ 20
శివాజీ, లయ కలిసి నటించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అదిరిందయ్యా చంద్రం. శివాజీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. శివాజీలో అదిరిపోయే కామెడీ టైమింగ్ ఉందని మరోసారి నిరూపించింది ఈ సినిమా.

=============================

kalyana-vaibhogame-zeecinemalu

కల్యాణ వైభోగమే
నటీనటులు : నాగశౌర్య, మాళవిక నాయర్
ఇతర నటీనటులు : రాశి, ఆనంద్, ప్రగతి, నవీన్ నేని, ఐశ్వర్య, తాగుబోతు రమేష్ మరియుతదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : కళ్యాణ్ కోడూరి
డైరెక్టర్ : B.V. నందిని రెడ్డి
ప్రొడ్యూసర్ : K.L. దామోదర్ ప్రసాద్
రిలీజ్ డేట్ : 4 మార్చి 2016
నందిని రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కళ్యాణ వైభోగమే. కేవలం పెద్దల బలవంతం పై పెళ్లి చేసుకున్న ఒక యువజంట పెళ్లి తరవాత ఏం చేశారు..? అనేదే ఈ సినిమా ప్రధానాంశం. యూత్ ఫుల్ కామెడీ ఈ సినిమాలో పెద్ద హైలెట్.

===========================

Gajakesari-గజకేసరి-yash-fpc-zeecinemalu

గజకేసరి
నటీనటులు – యష్, అమూల్య, ‘కాలకేయ’ ప్రభాకర్‌, అనంత్‌ నాగ్‌, గిరిజా లోకేష్‌, మాండ్య రమేష్‌, జాన్‌ విజయ్‌ తదితరులు
ప్రొడ్యూసర్లు – శ్రీ వేదాక్షర మూవీస్‌, కలర్స్ అండ్‌ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్
డైరక్టర్ – కృష్ణ
మ్యూజిక్ డైరక్టర్ – హరికృష్ణ
‘కె.జి.యఫ్‌’ హీరో యశ్‌ హీరోగా నటించిన చిత్రం ‘గజకేసరి’. కన్నడంలో హిస్టారికల్ యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమాకి యస్.కృష్ణ దర్శకత్వం వహించారు. యష్ గెటప్, యాక్షన్ ఈ సినిమాకు హైలెట్. ‘‘ప్రాణం పోయినా నన్ను నమ్ముకున్నవారి చేయి వదిలిపెట్టను’’ అంటూ యశ్‌ చెప్పే డైలాగ్‌ అందరినీ
ఆకట్టుకుంటుంది.

‘‘ప్రతి తల్లీ కోరుకునే బిడ్డ…ప్రతి రాజు గర్వపడే సేనాధిపతి..మన గజకేసరి’’, ‘‘శ్రీలంక నుంచి వచ్చానంటే
మామూలు రాక్షసుడిని అనుకున్నావా.. కాదు పదితలల రావణుడుని..’’ అంటూ సాగే సంభాషణలు ఈ సినిమాలో మెయిన్ ఎట్రాక్షన్స్. దీనికి తోడు క్లైమాక్స్ ఫైట్ బాహుబలిని గుర్తుకుతెస్తుంది. అమూల్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో… ‘కాలకేయ’ ప్రభాకర్‌, అనంత్‌ నాగ్‌, గిరిజా లోకేష్‌, మాండ్య రమేష్‌, జాన్‌ విజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఐకాన్‌ స్పేస్‌, సల్ల కుమార్‌ యాదవ్‌ సమర్పణలో వచ్చిన ఈ సినిమాని శ్రీ వేదాక్షర మూవీస్‌, కలర్స్ అండ్‌ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి.

=======================

బ్రహ్మోత్సవం
నటీనటులు : మహేష్ బాబు, సమంత రుత్ ప్రభు, కాజల్ అగర్వాల్
ఇతర నటీనటులు : ప్రణీత సుభాష్, నరేష్, సత్యరాజ్, జయసుధ, రేవతి, శుభలేఖ సుధాకర్ తదితరులు…
మ్యూజిక్ డైరెక్టర్స్ : మిక్కీ జె. మేయర్, గోపీ సుందర్
డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల
ప్రొడ్యూసర్ : ప్రసాద్ V. పొట్లూరి
రిలీజ్ డేట్ : 20 మే 2016
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘బ్రహ్మోత్సవం.’ కుటుంబ విలువలను వాటి ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ సినిమాలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మహేష్ బాబును సరికొత్త ఆంగిల్ లో ప్రెజెంట్ చేశాడు. ఎప్పటికీ తన కుటుంబ సభ్యులు కలిసి మెలిసి ఉండాలన్న తన తండ్రి ఆలోచనలు పుణికి పుచ్చుకున్న హీరో, తన తండ్రి కలను ఎలా నేరవేరుస్తాడు అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

=======================

yogi-zeecinemalu-prabhas

యోగి
నటీనటులు : ప్రభాస్, నయన తార
ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావు, ప్రదీప్ రావత్, సుబ్బరాజు, ఆలీ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : రమణ గోగుల
డైరెక్టర్ : V.V. వినాయక్
ప్రొడ్యూసర్ : రవీంద్ర నాథ్ రెడ్డి
రిలీజ్ డేట్ : 12 జనవరి 2017
ప్రభాస్ హీరోగా V.V. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన హై ఎండ్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ యోగి. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఊర్వశి శారద ప్రభాస్ కి తల్లిగా నటించారు. ఈ ఇద్దరి మధ్యన నడిచే ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

========================

Student-No-1-zeecinemalu-NTR

స్టూడెంట్ నంబర్ 1
నటీనటులు : N.T.R., గజాల
ఇతర నటీనటులు : రాజీవ్ కనకాల, బ్రహ్మానందం, ఆలీ, సుధ, కోట శ్రీనివాస రావు, M.S. నారాయణ
తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి
డైరెక్టర్ : S.S. రాజమౌళి
ప్రొడ్యూసర్ : K. రాఘవేంద్ర రావు
రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2001
ఇంజనీర్ అవ్వాలనే ప్యాషన్ ఉన్నా కేవలం చేయని నేరానికి శిక్షననుభవిస్తున్న తండ్రిని కాపాడుకోవడానికి లా కాలేజ్ లో జాయిన్ అవుతాడు ఆదిత్య. ఓ వైపు మర్డర్ కేసులో జైలు పాలయినా, జైలులో ఉంటూ కూడా తన తండ్రి గౌరవం కాపాడటానికి కష్టపడతాడు. అసలు ఆదిత్య చంపింది ఎవరిని…? ఎందుకు చేశాడా హత్య..?

తన తండ్రిని నిర్దోషిగా నిరూపించడంలో ఆదిత్య ప్రయత్నం సక్సెస్ అవుతుందా…? ఆదిత్య జైలు నుండి విడుదల అవుతాడా…? అనేదే ఈ సినిమా ప్రధానాంశం.