టాలీవుడ్ వీకెండ్ రిలీజ్

Thursday,October 27,2016 - 12:57 by Z_CLU

ఈ వీకెండ్ థియేటర్లలోకి ఏకంగా 4 సినిమాలు దూసుకొస్తున్నాయి. వీటిలో రెండు స్ట్రయిట్ సినిమాలు, మిగతా రెండు డబ్బింగ్ మూవీస్. సినిమా స్ట్రయిట్ అయినా, డబ్బింగ్ అయినా బజ్ క్రియేట్ చేస్తోంది మాత్రం ఒకే ఒక్కటి. ఆ సినిమానే కాష్మోరా. కార్తి-నయనతార హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సోసియో-ఫాంటసీ సినిమాపై కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే తెలుగులో కూడా రికార్డు థియేటర్లలో కాష్మోరా విడుదల అవుతోంది.

ఇక కాష్మోరాతో పాటు ధనుష్ నటించిన ధర్మయోగి సినిమా కూడా ఈ వీకెండ్ రిలీజ్ కు రెడీగా ఉంది. ట్రయిలర్ తో ఇప్పటికే ఎట్రాక్ట్ చేస్తున్న ఈ సినిమాలో త్రిష, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. అన్నింటికంటే స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే.. ఈ సినిమాలో త్రిష లేడీ విలన్ గా, నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతోంది.

collage2

కాష్మోరా, ధర్మయోగి సినిమాలతో పాటు ఛల్ ఛల్ గుర్రం, మిస్టర్ 420 సినిమాలు కూడా ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ రెండు సినిమాలపై అంచనాలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ..  ఈమధ్య కాలంలో చిన్న సినిమాలైనా సైలెంట్ హిట్ అందుకుంటున్న నేపథ్యంలో… వీటిపై కూడా ప్రేక్షకులు ఓ కన్నేసి ఉంచారు.