Weekend Release - రెడీ ఫర్ రిలీజ్

Thursday,March 25,2021 - 05:36 by Z_CLU

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా 4 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. రానా, నితిన్ నటించిన సినిమాలతో పాటు మరో 2 చిన్న సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.

నితిన్-కీర్తిసురేష్ జంటగా నటించిన రంగ్ దే సినిమా రేపు థియేటర్లలోకి వస్తోంది. వెంకీ అట్లూరి డైరక్ట్ చేసిన ఈ సినిమాపై మంచి బజ్ నడుస్తోంది. భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ట్రయిలర్ సూపర్ హిట్టయింది. సాంగ్స్ అన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.

రానా నటించిన పాన్ ఇండియా మూవీ అరణ్య కూడా రేపే థియేటర్లలోకి వస్తోంది. తెలుగులో అరణ్యగా, తమిళ్ లో కాదన్ గా ఇది రిలీజ్ అవుతోంది. హిందీ వెర్షన్ హాథీ మేరీ సాథీ మాత్రం రిలీజ్ అవ్వడం లేదు. ప్రభు సాల్మాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతినిస్తుందని చెబుతున్నాడు రానా.

ఇక పవన్ తేజ్ కొణెదల, మేఘన జంటగా నటించిన సినిమా ఈ కథలో పాత్రలు కల్పితం. అభిరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీ కూడా రేపే రిలీజ్ అవుతోంది.

ఈ 3 సినిమాల కంటే కాస్త ఆలస్యంగా 27వ తేదీన రిలీజ్ అవుతున్న మూవీ తెల్లవారితే గురువారం. కీరవాణి కొడుకు సింహా కోడూరి హీరోగా నటించిన ఈ సినిమాలో చిత్రాశుక్ల హీరోయిన్. కీరవాణి మరో కొడుకు కాలభైరవ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ట్రయిలర్ హిట్టవ్వడం, ఎన్టీఆర్-రాజమౌళి లాంటి ప్రముఖులు దగ్గరుండి సినిమాకు ప్రచారం చేయడం కలిసొచ్చింది.