Interview -రానా (అరణ్య)

Tuesday,March 23,2021 - 05:58 by Z_CLU

కెరీర్ ప్రారంభం నుండి విభిన్న పాత్రలతో అలరిస్తూ హీరోగా మంచి ప్లానింగ్ తో వెళ్తున్న రానా దగ్గుబాటి అడవి నేపథ్యంలో  ‘అరణ్య’ అనే సినిమా చేశాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చ్ 26న థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా అరణ్య గురించి రానా మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు రానా మాటల్లోనే…

ఏనుగుల కథ 

ప్రభు సాల్మాన్‌ తీసిన ‘కుమ్కి’ కథలో ఏనుగు ఒక పార్టు మాత్రమే. ఆ తర్వాత ఏనుగులు, అడ‌వుల‌ గురించి బాగా పరిశోధన చేసిన ప్రభు ‘అరణ్య’ కథను రెడీ చేశారు. మ్యాన్ అండ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ మీద కథ రాసుకొని ఎరోస్ తో కలిసి నన్ను అప్రోచ్ అయ్యారు. ఈ క‌థ చెబుతున్న‌ప్పుడే అడివి గురించి ఫ‌స్ట్ టైమ్ నాకు అంత డీటైల్డ్‌గా అర్ధం అయ్యింది. అడవిలో ఏనుగులకి అడ్డుగా ఉన్న ఓ గోడ ఆ గోడను తొలగించేందుకు ఓ వ్యక్తి చేసిన కృషి అనేది మెయిన్ పాయింట్. సినిమాలో మంచి ఎమోషన్ ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు ఆ ఎమోషన్ కి బాగా కనెక్ట్ అవుతారు.

ఒక డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియ‌న్స్

ఈ సినిమా షూటింగ్‌ కోసం 15రోజులు ముందుగానే థ్యాయ్‌లాండ్‌కు వెళ్లాం. అక్కడి అడవుల్లో మాకు కావాల్సిన లొకేషన్స్‌ కోసం సెర్చ్‌ చేశాం. ఏనుగుల పార్క్స్‌లో షూటింగ్‌ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకున్నాం. ఈ కథ గురించి ప్రభు చెప్పినప్పుడు 18 ఏనుగులతో షూట్‌ చేయాల్సి ఉంటుంది అన్నారు. అందుకే ముందుగా ఏనుగులతో సాన్నిహిత్యం పెంచుకునేందుకు రేంజర్స్‌ (ఏనుగుల సంరక్షులు) పర్యవేక్షణలో శిక్షణ తీసుకున్నాను. సాధారణంగా ఒక ఏనుగు మన పక్కన నడిస్తేనే భూమి కంపిస్తుంది. అలాంటిది ఒకేసారి 18 ఏనుగులు మీ వెన‌క న‌డుస్తూవ‌స్తుంటే ఆ విజువ‌ల్ ఊహించుకోండి. అది ఒక డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియ‌న్స్.

నటుడిగా ఎదిగా 

సినిమా సినిమాకి నటుడిగా నేర్చుకుంటూ వస్తున్నా. ఈ సినిమాతో ఇంకా ఎక్కువ ఎదిగాననిపించింది. నేను ఏ క్యారెక్ట‌ర్ అయినా చేయ‌ల‌గ‌ల‌ను అని ఫ‌స్ట్ న‌మ్మిన వ్య‌క్తులు వాళ్లే. అందుకే బాబాయ్ , శేఖర్ కమ్ముల గారికి సినిమా చూపించి ఈవెంట్ కి పిలిచా.  సినిమా చూశాక ప్రేక్షకుల నుండి కూడా మంచి కాంప్లిమెంట్స్ వస్తాయనుకుంటున్నా.

కొత్త అనుభూతి 

మొదటి రోజు అడవిలో వెళ్ళినప్పుడు మంచి అనుభూతి కలిగింది. సరికొత్త దారులు , మనుషులు కనిపించని ప్రదేశం ఇలా అన్నీ కొత్తగా అనిపించాయి. సినిమాలో ఎక్కువ క్యారెక్టర్స్ ఉండవు. ముఖ్యంగా అడవిలో నాకు ఏనుగుల మధ్యే సన్నివేశాలు ఉంటాయి. మనిషులతో కాకుండా ఏనుగులతో కలిసి నటించడం కొత్త ఎక్స్ పీరియన్స్.

టైం పట్టింది 

ఏనుగులతో మమేకమవ్వడానికి కొంత టైం పట్టింది. వాటికి ఆహరం పెట్టేటప్పుడు నేను కూడా వాళ్ళల్లో కలిసిపోయి వాటికీ ఆహరం పెట్టడం దగ్గరికి వెళ్లి నిల్చోవడం వంటివి చేస్తుండేవాడిని. కొన్ని రోజులకి వాటితో ఆడుకోవడం మొదలు పెట్టాను. షూట్ గ్యాప్ లో వాటితోనే ఎక్కువ సమయం గడిపే వాడిని. అవన్నీ షూట్ టైంలో హెల్ప్ అయ్యాయి.

ఆ క్షణం భయమేసింది 

నేను ఏనుగుల ముందు నిలుచొని ఒక సీన్ చేయాలి. నా జేబులో నుండి ఒక అరటి పండు కాస్త బయటికొచ్చి కనిపిస్తుంది. అది చూసి ఒకే సారి 18 ఏనుగులు నా దగ్గరికి రాబోయాయి. ఆ సమయంలో చాలా భయమేసింది. వెంటనే ట్రైనర్స్ వాటిని కంట్రోల్ చేశాయి. నేను భయపడటం చూసి అవి కూడా కొంచెం కంగారు పడ్డాయి.

అదృష్టంగా భావిస్తున్నా

నేను నా కేరీర్‌లో అమితాబ్‌గారు, అజిత్ గారిలాంటి డిఫ‌రెంట్ యాక్ట‌ర్స్‌తో ఎన్నో యూనిక్ చిత్రాల్లో న‌టించే అవ‌కాశం రావ‌డం అదృష్టంగా భావిస్తున్నాను.

రోజుకో కొత్త విషయం నేర్చుకుంటున్నా 

పవన్ కళ్యాణ్ గారితో కలిసి సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఆయన దగ్గరి నుండి రోజుకో కొత్త విషయం నేర్చుకుంటున్నా. చాలా జెన్యూన్ అండ్ ఒరిజినల్ పర్సన్ ఆయన. వెరీ వెరీ ఎంక‌రేజింగ్ ప‌ర్స‌న్‌. ఆ సినిమా రిలీజ్ టైమ్‌లో తప్పకుండా ప‌వ‌న్‌గారి ప‌క్క‌న కూర్చుని  మాట్లాడతాను.