ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన “ఉన్నది ఒకటే జిందగీ”

Friday,October 27,2017 - 11:42 by Z_CLU

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించిన సినిమా ఉన్నది ఒకటే జిందగీ. కిషోర్ తిరుమల డైరక్ట్ చేసిన ఈ మూవీ, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. రామ్-కిషోర్ తిరుమలది హిట్ కాంబినేషన్ కావడం, పాటలు-ట్రయిలర్ కు  ఇప్పటికే మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా గ్రాండ్ గా ఓపెన్ అయింది ఈరోజు.

మొదటి రోజు ఆడియన్స్ నుంచి ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. అటు యూఎస్ లో ఇప్పటికే ప్రీమియర్స్ పూర్తికావడంతో.. అక్కడ్నుంచి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది.

దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. మరోవైపు రామ్ మేకోవర్ కు యూత్ అంతా ఫిదా అయిపోయారు. ఈ ఎలిమెంట్స్ కు తోడు కంప్లీట్ ఫ్రెండ్ షిప్ థీమ్ తో వచ్చిన సినిమా కావడంతో.. కుర్రాళ్లలో ఉన్నది ఒకటే జిందగీ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఈ సినిమా ఎట్రాక్ట్ చేస్తుందని ధీమాగా ఉంది యూనిట్. ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్‌ సినిమాస్‌ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్‌ పతాకంపై కృష్ణచైతన్య నిర్మించిన ఈ సినిమాలో మరో హీరో శ్రీవిష్ణు కీలక పాత్ర పోషించాడు. యూఎస్ తెలుగు మూవీస్ సంస్థ అమెరికాలో ఈ సినిమాను రిలీజ్ చేసింది.