ఉన్నది ఒక్కటే జిందగీ కాంటెస్ట్

Monday,October 23,2017 - 11:27 by Z_CLU

రామ్ హీరోగా నటించిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ఉన్నది ఒక్కటే జిందగీ. ఫ్రెండ్ షిప్ కు ఓ కొత్త అర్థాన్నిస్తూ తెరకెక్కిన ఈ సినిమా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ గ్యాప్ లో ఫ్రెండ్ షిప్ డేను మరోసారి సెలబ్రేట్ చేసుకుందాం రమ్మంటోంది యూనిట్. దీనికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ పెట్టింది.

మీ జీవితంలో మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పండి. మీ ప్రాణస్నేహితుడితో దిగిన ఫొటోతో పాటు మీ పేరు, సెల్ నంబర్ ను vo.zindagi@gmail.com కి మెయిల్ చేయండి. మీరిద్దరూ ఎలా బెస్ట్ ఫ్రెండ్స్ గా మారారో ఆ మరపురాని సంఘటనని కూడా మెయిల్ లో రాయండి.

బెస్ట్ ఆన్సర్స్ రాసిన బెస్ట్ ఫ్రెండ్స్.. రామ్ ను కలిసే ఛాన్స్ పొందొచ్చు. కేవలం రామ్ ను మాత్రమే కాదు, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో మిగతా స్టార్స్ ను కలిసి ఫొటోలు దిగొచ్చు. ఈనెల 25న జరగనున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో బెస్ట్ ఫ్రెండ్స్ కలవడానికి రామ్ రెడీగా ఉన్నాడు. మరి మీరు రెడీనా. వెంటనే మీ బెస్ట్ ఫ్రెండ్ ఫొటోతో పాటు ఓ ఇన్సిడెంట్ ను పైన చెప్పిన మెయిల్ ఐడీకి రాసిపంపించండి. అంతేకాదు.. కాంటెస్ట్ లో గెలిచినవాళ్లకు ఉన్నది ఒకటే జిందగీ మూవీ టికెట్స్ కూడా గెలుచుకోవచ్చు. రేపు రాత్రితో ఈ కాంటెస్ట్ ముగుస్తుంది. త్వరపడండి..