ప్రభాస్ 'సాహో' ఫస్ట్ లుక్

Monday,October 23,2017 - 10:58 by Z_CLU

యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అతడు నటిస్తున్న సాహో సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ ఆ ఎక్స్ పెక్టేషన్స్ ను మరింత పెంచింది. ముక్కు వరకు స్కార్ఫ్ వేసుకున్న ప్రభాస్.. నల్లటి లాంగ్ కోటులో ఎత్తైన భవంతుల మధ్య నుంచి స్టయిలిష్ గా నడుచుకుంటూ వచ్చే స్టిల్ ను ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు.

బాహుబలి-2 రిలీజ్ సందర్భంగా సాహో ప్రీ-లుక్ టీజర్ విడుదల చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు ఫస్ట్ లుక్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది సాహో. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సైమల్టేనియస్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది సాహో.

దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో రాబోతున్న సాహో సినిమాకు బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరక్టర్లు శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతం అందిస్తున్నారు. మాడీ సినిమాటోగ్రాఫీ, సాబూ సిరిల్ ఆర్ట్ డిజైనింగ్ సినిమాకు అదనపు ఆకర్షణలుగా నిలవబోతున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రానుంది సాహో.