'కప్పెళ' రీమేక్ లో యంగ్ హీరో?

Thursday,July 09,2020 - 02:06 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని రీమేక్స్ రెడీ టూ షూట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అందులో మలయాళ సినిమా ‘కప్పేలా’ ఒకటి. చిన్న సినిమాగా విడుదలై మల్లువుడ్ లో మంచి సక్సెస్ సాదించిన ఈ సినిమాకు సంబంధించి తెలుగు రీమేక్ రైట్స్ ను సితార ఎంటర్టైన్ మెంట్స్ సంస్థ దక్కించుకుంది. ప్రస్తుతం డైరెక్టర్ తో పాటు మిగతా క్యాస్టింగ్ కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్.

తాజాగా ఈ రీమేక్ కు హీరోగా విశ్వక్ సేన్ ను సంప్రదించారట. ఒరిజినల్ సినిమా చూసిన విశ్వక్ ఈ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. విశ్వక్ ఆల్రెడీ ‘ఫలక్ నుమ దాస్’ తో ఓ మలయాళ సినిమాను రీమేక్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది అతడికి రెండో రీమేక్ అవుతుంది.

మరి ‘కప్పెళ’ రీమేక్ లో విశ్వక్ ఫిక్స్ అని మేకర్స్ అనౌన్స్ చేసే వరకు ఇది రూమర్ మాత్రమే అనుకోవాలి.