'రొమాంటిక్'లో రామ్ అలా కనిపిస్తాడట

Thursday,July 09,2020 - 02:40 by Z_CLU

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా అనిల్ పాడూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న’రొమాంటిక్’ సినిమా లాక్ డౌన్ కి ముందే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమాలో హీరో రామ్ ఓ గెస్ట్ గా కనిపించనున్నాడు. అవును.. ఇస్మార్ట్ శంకర్ తో తనకి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన పూరి కోసం ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించాడు రామ్.

సినిమాలో ఓ సాంగ్ లీడ్ రామ్ తోనే స్టార్ట్ అవుతుందని, అందులో ఎనర్జిటిక్ స్టెప్స్ వేశాడని సమాచారం. సో ఆ సాంగ్ కి థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ రావడం ఖాయం అంటోంది యూనిట్.

పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ , చార్మీ నిర్మిస్తున్న ఈ సినిమా థియేటర్స్ ఓపెన్ అవ్వగానే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు పూరి.