గీతగోవిందం ప్రీ-లుక్: వెరీ ఇంట్రెస్టింగ్

Thursday,June 21,2018 - 11:51 by Z_CLU

గీతగోవిందం అనే టైటిల్ ఫిక్స్ చేసిన యూనిట్, ప్రీ-లుక్ విడుదల చేసింది. 23న ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. ప్రీ-లుక్ సందర్భంగా రిలీజ్ చేసిన స్టిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

సినిమాలో హీరోహీరోయిన్ల పేర్లు గోవింద్, గీత. అందుకే సినిమాకు గీతగోవిందం అనే టైటిల్ పెట్టారు. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ, రష్మిక తమదైన స్టయిల్ లో రివీల్ చేశారు. ట్విట్టర్ లో ఫన్నీ డిస్కషన్ తో తన పాత్రల పేర్లను రివీల్ చేశారు. ఆ ట్వీట్ సంభాషణ మీకోసం..

రష్మిక: ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్ అంట కదా.. కంగ్రాట్స్ గోవింద్
విజయ్ దేవరకొండ: మేడమ్.. గీతా మేడమ్.. మీతో టైం గడపడం నాకు నిజంగా అవార్డు. ఇవి వస్తుంటాయ్, పోతుంటాయ్.
రష్మిక: ఇదిగో గోవిందం, ఈ ఓవరాక్షనే తగ్గించుకోమనేది. అసలు నీకు కాదు, ప్రభాస్ కో తారక్ కో ఇస్తే ఈ గొడవ పోయేది
విజయ్ దేవరకొండ: అవార్డులో ఏముంది మేడమ్, మీలాంటి వాళ్లు నన్ను ప్రేమించడం చాలు.
రష్మిక: నా లాంటి వాళ్లా..? వాళ్లు ఏంటి? ఆ బహువచనం ఏంటి? తెలుసులే నీ గురించి. ఒక్కరు సరిపోరు. ఎవర్నీ వదలవుగా.
విజయ్ దేవరకొండ: నా ఉద్దేశం అది కాదు మేడమ్, నన్ను ఓసారి 23న కలవండి మేడం. అన్నీ వివరిస్తా.

ఇలా గీత, గోవింద్ అనే క్యారెక్టర్ నేమ్స్ ను తమదైన స్టయిల్ లో రివీల్ చేశారు. పరశురాం డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు.