విజయ్ ఆంటోనీ కెరీర్ లో మరో విజయం

Monday,February 27,2017 - 11:30 by Z_CLU

విలక్షణ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ, టాలీవుడ్ లో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. బిచ్చగాడుతో తెలుగులో పాపులర్ అయిన ఈ హీరో… లేటెస్ట్ గా యమన్ సినిమాతో మరో హిట్ కొట్టాడు. కొత్తగా ప్రయత్నించిన ప్రతిసారి సక్సెస్ వస్తుందని మరోసారి ప్రూవ్ చేశాడు.

దేశవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన యమన్ సినిమా తొలిరోజు నుంచే ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేసింది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ తెలుగు ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. విజయ్ ఆంటోనీ, మియా జాార్జ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు, స్వతహాగా సంగీత దర్శకుడైన ఆంటోనీనే మ్యూజిక్ అందించాడు. అటు తమిళనాడు, ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. ఈ సినిమా సాధించిన వసూళ్లను ప్రకటిస్తూ, త్వరలోనే సక్సెస్ మీట్ పెట్టే ఆలోచనలో ఉన్నాడు విజయ్ ఆంటోనీ.