చిరంజీవి కథతో వెంకటేష్ మూవీ

Wednesday,December 28,2016 - 11:21 by Z_CLU

త్వరలోనే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు విక్టరీ వెంకటేష్. ప్రాజెక్టు ఓకే అవ్వలేదు. ఇంకా చర్చల దశలోనే ఉంది. హీరోల్ని పవర్ ఫుల్ గా, మోస్ట్ ఎగ్రెసివ్ గా.. ఇంకా చెప్పాలంటే కెరీర్ లోనే ది బెస్ట్ లుక్ లో చూపించే టాలెంట్ పూరి జగన్నాధ్ దగ్గరుంది. పైగా వెంకీని పూరి ఇప్పటివరకు డైరక్ట్ చేయలేేదు. సో.. ప్రాజెక్టు ఫైనల్ అయ్యే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. అయితే వెంకీకి పూరి వినిపించిన కథ మాత్రం చిరంజీవిది అని టాక్.

puri-jagannadh-latest-stills-20

మెగాస్టార్ రీఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు.. తన 150వ సినిమాకు దర్శకుడిగా మొదట పూరి జగన్నాధ్ పేరునే ప్రకటించాడు. ఆ ప్రాజెక్టుకు ఆటోజానీ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అవ్వడం.. ఖైదీ నంబర్-150ను చిరంజీవి సెట్స్ పైకి తీసుకురావడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు ఇదే ఆటోజానీ కథను వెంకటేష్ కు పూరి జగన్నాధ్ వినిపించాడనే ప్రచారం జోరుగా సాగుతోంది.