శాతకర్ణికి బ్రాండ్ అంబాసిడర్

Wednesday,December 28,2016 - 12:23 by Z_CLU

బాబాయ్-అబ్బాయ్ మధ్య ఇప్పుడంతా కూల్. ఇద్దరూ కలిసి మల్టీస్టారర్ చేస్తారనే భ్రమలు ఎవరికీ లేకపోయినా… ఒకరి సినిమాను మరొకరు మెచ్చుకుంటూ ముందుకుసాగిపోతున్నారు. తాజాగా గౌతమీపుత్ర శాతకర్ణి ట్రయిలర్ ను యంగ్ టైగర్ మెచ్చుకున్నాడు. హాలీవుడ్ రేంజ్ లో ట్రయిలర్ ఉందని ట్వీట్ చేశాడు. మొన్న విడుదలైన సాాంగ్స్ కూడా బాగున్నాయంటున్నాడు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ఎన్టీఆర్ ప్రచారం చేస్తాడేమో అనే డిస్కషన్ మొదలైంది.

నిజానికి ఎన్టీఆర్ ఇప్పుడు బిజీగా ఏం లేడు. కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి ఇంకాస్త టైం ఉంది. సో… బాలయ్య అడిగినా అడకపోయినా… శాతకర్ణి సినిమాకు ప్రమోషన్ ఇవ్వాలనుకుంటే ఎన్టీఆర్ ఆ పని చేయొచ్చు. ఈమధ్యే కల్యాణ్ రామ్ నటించిన ఇజం సినిమాకు యంగ్ టైగర్ బ్రాండ్ అంబాసిడర్ గా వర్క్ చేశాడు. ఆ సినిమా ఆడియో ఫంక్షన్ కు కూడా హాజరయ్యాడు. సో… ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని.. శాతకర్ణి సినిమాను కూడా ఎన్టీఆర్ ప్రమోట్ చేసే ఛాన్స్ ఉందని చాలామంది ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.