ఈ కాంబినేషన్ వర్కవుట్ అవుతుందా?

Sunday,July 05,2020 - 10:32 by Z_CLU

ఫిలింనగర్ లో కొత్తగా మరో గాసిప్ పుట్టుకొచ్చింది. ఈసారి పుకార్లలోకి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఎంటరయ్యారు. అవును.. సుదీర్ఘ విరామం తర్వాత రాఘవేంద్రరావు మరోసారి మెగాఫోన్ పట్టుకోబోతున్నారట. ఈసారి ఈయన డైరక్ట్ చేసేది ఎవర్నో తెలుసా. హీరో వెంకటేశ్.

రాఘవేంద్రరావు, వెంకటేశ్ కాంబోలో సినిమాపై ప్రస్తుతం తెరవెనక చర్చలు సాగుతున్నాయనేది ప్రధానమైన పుకారు. కొంతమంది దీన్ని రీమేక్ ప్రాజెక్ట్ అంటున్నారు, మరికొంతమంది స్ట్రయిట్ మూవీ అంటున్నారు. ఎక్కువమంది అస్సలు వెంకీ-రాఘవేంద్రరావు కాంబో ఉండదని అంటున్నారు.

ఈ పుకార్ల సంగతి కాసేపు పక్కనపెడితే.. వీళ్లిద్దరి కాంబోలో మంచి హిట్స్ వచ్చిన మాట వాస్తవం. కలియుగ పాండవుల నుంచి స్టార్ట్ చేస్తే.. కూలీనంబర్ వన్, సుందరకాండ లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. వీళ్లిద్దరూ కలిసి చేసిన ఆఖరి సినిమా సుభాష్ చంద్రబోస్.