నారప్పలో మునిక‌‌న్నా పాత్ర‌లో కార్తిక్

Sunday,July 05,2020 - 10:36 by Z_CLU

సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా వెంకటేష్ హీరోగా వస్తున్న సినిమా నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు.

సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న చిత్రంలో నారప్ప భార్య సుందరమ్మ గా ప్రియమణి న‌టిస్తోంది. కాగా నార‌ప్ప పెద్ద కొడుకు మునిక‌‌న్నా గా కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ కార్తిక్ ర‌త్నం న‌టిస్తున్నాడు.

ఈ రోజు కార్తిక్ పుట్టిన‌రోజు సందర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ మునిక‌న్నా లుక్‌ని విడుద‌ల చేసింది నార‌ప్ప చిత్ర యూనిట్‌.

విక్టరీ వెంకటేష్‌, ప్రియమణి,కార్తిక్ ర‌త్నం త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి,
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు,
సంగీతం: మణిశర్మ,
ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్‌,
ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌,
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ శంకర్‌ డొంకాడ,
నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను
దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల